Chandrika Ravi | నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి తో తెలుగు ప్రేక్షకుల్లో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది ఆస్ట్రేలియన్ సుందరి చంద్రికారవి (Chandrika Ravi). ఈ చిత్రంలో మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి.. అంటూ సాగే పాటలో మెరిసి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఆసక్తికర అప్డేట్ ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది.
తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునేందుకు చంద్రికా రవి పడ్డ కష్టాన్ని, చాలా మందికి స్పూర్తినిచ్చే ఆమె కథ గురించి తెలుసుకున్న Rukus Avenue Radio వ్యవస్థాపకుడు సమ్మీ చంద్ చంద్రికారవికి అరుదైన అవకాశం కల్పించారు. అమెరికన్ టాక్ షో ది చంద్రికా రవి షో (The Chandrika Ravi Show) హోస్ట్‌గా వ్యవహరించనుంది చంద్రికా రవి. ఈ షోకు చంద్రికా రవి సహనిర్మాతగా కూడా వ్యవహరిస్తుండటం విశేషం. తన జీవిత అనుభవాలను ప్రేక్షకులందరితో షేర్ చేసుకునేందుకు ఈ షోను చేస్తుండటం ఎక్జయిటింగ్‌గా ఉందని చెప్పింది ఈ అమ్మడు .
యూఎస్‌లో అతిపెద్ద నెట్‌వర్క్‌ల్లో ఒకటైన iHeart Radioలో ఈ షో ప్రసారం కానుంది. టాక్ షో రూపకల్పన నుంచి ప్రమోషన్స్ వరకు ప్రతీది చంద్రికా రవి చూసుకుంటోంది. షోకు సంబంధించి ఎక్కువ వరకు ప్రమోషన్స్ నేను ఎడిట్ చేసి.. నిర్మించినవేనని గర్వంగా చెబుతున్నట్టు పేర్కొంది చంద్రికా రవి. కొన్నేళ్లుగా నా టాక్ షోపై వర్క్ చేస్తున్నా. ఈ షోకు జీవం పోయాల ఇప్పటివరకు వేచి చూశాను. ఈ షో కొంచెం ఒత్తిడితో కూడుకున్నప్పటికీ బహుమతిలాంటి అనుభవం. నా ఇన్నేళ్ల ప్రదర్శనలతో పోలిస్తే.. కెమెరా ముందు టాక్ షో నాకో కొత్త అనుభవం. ప్రజలు ఇక నిజమైన చంద్రికా రవిని చూస్తారు. నేను మొదటి వ్యక్తిని కావచ్చు.. కానీ నేను చివరిదాన్ని మాత్రం కాను.. అంటూ టాక్ షో గురించి నవ్వుతూ చెప్పుకొచ్చింది చంద్రికారవి.
చంద్రికా రవి సినీ కెరీర్‌కు ముందు రేడియో, టెలివిజన్‌లో అనేక లైవ్ షోలను నిర్వహించింది. ఈ భామకు పబ్లిక్ స్పీకింగ్‌పై ఆసక్తి ఎక్కువ. యూఎస్‌లో రేడియో షోను హోస్ట్ చేసిన మొదటి భారతీయ మహిళగా అరుదైన రికార్డు చంద్రికా రవి ఖాతాలో చేరడం విశేషం. భారతీయ కాలమానం ప్రకారం ప్రతీ గురువారం ఉదయం 7:30 గంటలకు ప్రసారం కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు చేరువ చేసేందుకు ప్రతీ శుక్రవారం ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్‌లో విడుదల చేయనున్నారు.
చంద్రికా రవి చిట్‌చాట్ వీడియో ..
Watch the 1 minute interview with @chandrikaravi_ about #VeeraSimhaReddy and her working experience with Balayya 🔥
Natasimham #NandamuriBalakrishna @megopichand @shrutihaasan @varusarath5 @OfficialViji @MusicThaman @RishiPunjabi5 @MythriOfficial @SonyMusicSouth pic.twitter.com/4BeR8dCkGl
— BA Raju's Team (@baraju_SuperHit) January 5, 2023
మా బావ మనోభావాలు సాంగ్ ప్రోమో..