దసరా కానుకగా ‘అఖండ 2: తాండవం’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ. ఆయన నటిస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా ఇదే కావడం విశేషం. ఈ చిత్రానికి సంబంధించిన ఏ వార్త బయటకొచ్చినా అది క్షణాల్లో వైరల్ అయిపోతున్నది. దానికి కారణం ఈ సినిమాకున్న క్రేజే. త్వరలోనే దర్శకుడు బోయపాటి శ్రీను ‘అఖండ 2’ నెక్ట్స్ షెడ్యూల్‌ని ప్లాన్ చేశారట. ఈ షెడ్యూల్లో ఓ వైవిధ్యమైన పాటను కూడా ఆయన డిజైన్ చేశారట. ఈ పాట కోసమే ప్రత్యేకంగా ఓ స్టార్ హీరోయిన్ను రంగంలోకి దించనున్నారట బోయపాటి.
ముందు ఈ పాటను ఆమెపై షూట్ చేసి, తర్వాత దానికి బాలయ్య అఘోరా పాత్ర షాట్స్‌ని యాడ్ చేయాలనేది బోయపాటి ప్లాన్. ఆడియన్స్‌కి రోమాంచితుల్ని చేసేలా ఈ పాట ఉంటుందని చిత్రబృందం చెబుతున్నది. మరి ఈ పాటలో నర్తించే కథానాయిక ఎవరో తెలియాల్సివుంది. ప్రగ్యా జైశ్వాల్, సంయుక్త మీనన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్‌గా కనిపించనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.థమన్, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, నిర్మాణం: 14రీల్స్ బ్యానర్.