బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబో అంటే బ్లాక్‌బస్టర్ గ్యారంటీ అన్నది అభిమానుల మాట. ఇప్పటికే హ్యాట్రిక్ హిట్‌ను సొంతం చేసుకున్న ఈ ద్వయం ‘అఖండ-2’తో డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకురాబోతున్నారు. ఈ డివోషనల్ యాక్షన్ డ్రామా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నది. ఈ చిత్రం డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకురానుంది. ‘అఖండ’ అపూర్వ విజయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాపై దర్శకుడు బోయపాటి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని, విజువల్స్ మొదలుకొని యాక్షన్ ఘట్టాల వరకు అన్కాంప్రమైజ్డ్గా తెరకెక్కిస్తున్నారని చెబుతున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్లో 600 డ్యాన్సర్ల బృందంతో మాస్ పాటను తెరకెక్కిస్తున్నారు. భాను మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్న ఈ పాట అదిరిపోయే ట్యూన్‌తో ఉర్రూతలూగిస్తుందని చెబుతున్నారు. ఈ గీతానికి తమన్ స్వరకర్త. ‘అఖండ’ను మించిన భావోద్వేగాలు, యాక్షన్ హంగులతో అభిమానులకు ఓ పండగలా ఈ సినిమా ఉంటుందని మేకర్స్ తెలిపారు. సంయుక్తమీనన్, ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీ ఆచంట, రచన-దర్శకత్వం: బోయపాటి శ్రీను.