Balagam | తెలంగాణలోని కుటుంబ మూలాలు, భావోద్వేగాల నేపథ్యంలో సాగే రూరల్ ఫ్యామిలీ డ్రామా ఫిల్మ్ బలగం (Balagam). కమెడియన్ వేణు ఎల్దండి దర్శకత్వం (డెబ్యూ) వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రియదర్శి (Priyadarshi), కావ్య కల్యాణ్ రామ్ హీరోహీరోయిన్లుగా నటించగా.. వేణు ఎల్దండి, మురళీధర్ గౌడ్, జయరామ్, రూప, రచనా రవి కీలక పాత్రల్లో కనిపించారు. థియేటర్లకు వచ్చిన సినీ జనాల కంట కన్నీళ్లు పెట్టించిన ఈ సినిమా ఓటీటీలో కూడా సక్సెస్ఫుల్ టాక్ తెచ్చుకొని మంచి ప్రశంసలు అందుకుంది.
అయితే కుటుంబసమేతంగా థియేటర్‌కు వెళ్లలేకపోయిన వారు, థియేటర్లు, ఓటీటీలో బలగం సినిమా చూడని వారి కోసం ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చేసింది. బలగం త్వరలో అందరి ఇండ్లలో సందడి చేయనుంది. బలగం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ వచ్చేసింది. ఈ చిత్రం మే 7న స్టార్ మాలో సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత ఈ చిత్రాన్ని నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు.
బలగంలోని పాటలు పల్లెటూరి గొప్పదనాన్ని కండ్లకు కట్టినట్టు చూపించడమే కాకుండా కుటుంబ మూలాలను ప్రతిబింబించేలా సాగుతూ.. అందరి మనస్సులో సుస్థిర స్థానం సంపాదించుకున్నాయి. బలగం టీవీ టీఆర్పీ రేటింగ్స్‌లో కూడా సత్తా చాటుతుందనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు సినీ జనాలు.
Balagam | భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్కు ఫిదా.. బలగం ఖాతాలో మరో పురస్కారం
Gaami | విశ్వక్ సేన్ గామి అప్డేట్ ఇచ్చిన చాందినీ చౌదరి