Balagam movie : ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించి ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా ‘బలగం’. ఈ చిత్రాన్ని దిల్ రాజు ప్రొడక్షన్స్‌పై శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించారు. వేణు ఎల్దండి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా సక్సెస్‌మీట్ నిర్వహించారు. దిల్ రాజు మాట్లాడుతూ…‘సినిమా చూసిన ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి గురవుతున్నారు.
దర్శకుడు వేణు సినిమాను ఆకట్టుకునేలా తెరకెక్కించారు’ అన్నారు. దర్శకుడు వేణు మాట్లాడుతూ…‘సినిమా అందరినీ ఉద్వేగానికి గురిచేస్తున్నది. సినిమా చివరి పది నిమిషాలు థియేటర్ మొత్తం సైలెంట్‌గా మారిపోయింది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తున్నది’ అన్నారు.