నందమూరి బాలకృష్ణ..ఆహా కోసం హోస్ట్‌గా మారి అన్‌స్టాపుబల్ అనే షో చేస్తున్న విషయం తెలిసిందే. వరుసగా రెండు వారాలు మోహన్ బాబు మరియు నానిలతో సందడి చేసిన బాలకృష్ణ… మూడవ వారంకి బ్రేక్ ఇచ్చాడు. అతని భుజానికి సర్జరీ కావడం, వైద్యులు మూడు వారాలు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో తప్పక అన్ స్టాపబుల్ కు చిన్న బ్రేక్ వేశారు. ఈ షో తిరిగి ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
షోకి తర్వాతి రోజులలో రానున్న గెస్ట్‌లకు సంబంధించి పలు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల మోక్షజ్ఞ ఈ షోతో డిజిటల్ ఎంట్రీ ఇవ్వనున్నట్టు వార్తలు రాగా, తాజాగా బ్రహ్మానందం కూడా రాబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇటీవలే అలీతో సరదాగా షో లో బ్రహ్మానందం వచ్చాడు. ఆ ఎపిసోడ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకే బాలయ్య అన్ స్టాపబుల్ కి కూడా బ్రహ్మానందంను తీసుకు వచ్చేందుకు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
మరోవైపు బ్రహ్మానందం మళ్లీ బిజీ అయ్యేందుకు ఇలా షోలలో సందడి చేస్తున్నాడనే టాక్ వినిపిస్తుంది. గత కొద్ది రోజులుగా బ్రహ్మీ సెలక్టివ్‌గా పాత్రలు ఎంపిక చేసుకుంటున్నాడు. జాతిరత్నాలు సినిమాలో చిన్న పాత్ర అయినా కూడా నటించి ఆ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. అలాంటి బ్రహ్మానందం అన్ స్టాపబుల్ షోలో ఎంత సందడి చేస్తాడో చూడాలి.