నందమూరి బాలకృష్ణని ఇన్నాళ్లు మనం నటుడిగా, సింగర్‌గా చూశాం.ఇప్పుడు తనలో దాగి ఉన్న మరో కోణాన్ని బయట పెట్టబోతున్నారు.గత కొద్ది రోజులుగా తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’ కోసం నందమూరి హీరో ఓ టాక్‌షోను చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ‘అన్ స్టాపబుల్’ పేరుతో ఈ టాక్ షో ప్రేక్షకుల ముందుకు రానుందని, రీసెంట్‌గానే అన్నపూర్ణ స్టూడియోలో బాలకృష్ణ ఈ టాక్ షోకు సంబంధించిన ఫొటో షూట్‌ను పూర్తి చేశారని వార్తలు వచ్చాయి.
అయితే ఆహా కోసం బాలయ్య చేసే టాక్ షోకి సంబంధించి అఫీషియల్ ప్రకటన విడుదలైంది. ది బాప్ ఆఫ్ ఆల్ టాక్ షోస్…అన్‌స్టాపబుల్ విత్ బాలయ్య అని ప్రోమో విడుదల చేశారు.చూస్తుంటే ఇది బుల్లితెర ప్రేక్షకులకి మంచి వినోదం పంచేలా కనిపిస్తుంది. తాజా సమాచారం మేరకు బాలయ్య తన టాక్‌షోలో తొలిసారి మంచు ఫ్యామిలీని కలవబోతున్నారట. మంచు మోహన్‌బాబు, విష్ణు, మనోజ్, లక్ష్మీ ప్రసన్నలని ఇంటర్వ్యూ చేస్తూ.. ఎన్టీఆర్, తనకు, ఇండస్ట్రీకి ఉన్న అనుబంధం, అనుభవాలను బాలయ్య ప్రశ్నిస్తారని సినీ వర్గాలు అంటున్నాయి.
అన్నపూర్ణ స్టూడియోస్‌లో దీనికి సంబంధించిన ప్రోమో షూట్ జరగగా, షూటింగ్ సమయంలో బాలయ్య కాలుకు చిన్న గాయం అయినట్లు తెలుస్తుంది. అయినా లెక్కచేయకుండా షూటింగ్‌ను పూర్తిచేశారట.
#Aha also announces its show with #NandamuriBalakrishna titled #UnstoppableWithNBK which they are terming as "THE BAAP OF ALL TALK SHOWS". #Akhanda #NBK107 #NBK pic.twitter.com/R6Mkw7XRdt
— Nandamuri Mokshagna Teja (@Mokshagna_Offl) October 9, 2021