Bala Krishna | నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం దర్శకుడు గోపీచంద్ మలినేనితో ఓ భారీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలో ఉండగానే, మరో ఆసక్తికరమైన కాంబినేషన్‌పై టాలీవుడ్లో చర్చ మొదలైంది. బాలయ్య, దర్శకుడు క్రిష్‌తో మరోసారి చేతులు కలపనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం, క్రిష్ ఇప్పటికే బాలయ్యకు ఓ పవర్ఫుల్ కథ వినిపించగా, అది ఆయనకు బాగా నచ్చినట్లు తెలుస్తోంది. కథలో చారిత్రక, భావోద్వేగ అంశాలు ఉండటంతో బాలయ్య ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి చూపుతున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలో అధికారిక ప్రకటనకు సిద్ధమవుతోందని సమాచారం.
జూన్ 10న బాలయ్య పుట్టినరోజు ఉండటంతో, ఆ రోజు ఈ కొత్త ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని టాక్ నడుస్తోంది. గతంలో కూడా బాలయ్య తన బర్త్‌డే సందర్భంగా కొత్త సినిమాలను ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. ఈ సారి ఈ భారీ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించే ప్లాన్‌లో ఉన్నారని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం బాలయ్య చేస్తున్న గోపీచంద్ మలినేని సినిమా విషయానికి వస్తే, ఇందులో హీరోయిన్గా నయనతార నటిస్తున్నారు. గతంలో ‘సింహా’, ‘శ్రీరామరాజ్యం’, ‘జై సింహా’ వంటి విజయవంతమైన చిత్రాల్లో ఈ జంట కలిసి నటించి ప్రేక్షకులను మెప్పించింది.
ఈ కొత్త సినిమాలో కూడా వీరిద్దరి కెమిస్ట్రీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ పీరియాడిక్ మూవీ భారీ స్కేల్లో తెరకెక్కుతోంది. గతంలో బాలయ్య–క్రిష్ కాంబినేషన్లో వచ్చిన చిత్రాలు మంచి స్పందన తెచ్చుకున్న నేపథ్యంలో, ఈ కొత్త ప్రాజెక్ట్‌పై కూడా సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అధికారిక ప్రకటన వస్తే ఈ కాంబో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు.