Bala Krishna| నందమూరి బాలకృష్ణకి ముక్కుమీద కోపం. ఆయనకి కోపం తెప్పించే పని ఎవరైన చేశారో అక్కడ ఎవరున్నా వారికి దబిడి దిబిడే. కొన్ని సార్లు ఫ్యాన్స్ కాస్త అతిగా ప్రవర్తించడంతో వారిపై బాలయ్య చేయి చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. క్షమశిక్షణలో బాలయ్య చాలా స్ట్రిక్ట్. ఆయన పెట్టిన బార్డర్ దాటారో ఇక అంతే. అయితే ఒకానొక సమయంలో బాలయ్య మూవీ సెట్స్‌కి ఓ డైరెక్టర్ తాగేసి వచ్చాడట. ఆ సమయంలో బాలయ్య రియాక్షన్ ఏమై ఉంటుందని అనుకుంటున్నారు. దర్శకుడు అని గౌరవం ఇచ్చి చేయి చేసుకోలేదు కాని, కొన్నిసార్లు దర్శకుడిపై కేకలు వేశారు.
లొకేషన్ కి వెళ్ళాక దర్శకుడి మాటని గౌరవించే లక్షణం బాలయ్యకి ఉంది. దర్శకుడు ఏం చెబితే అది చేస్తారు. సినిమా కమిట్ అయ్యాం కాబట్టి పూర్తి చేయాలి అని ఆ దర్శకుడు ఏం చేసిన బాలయ్య సైలెంట్‌గా ఉంటూ సినిమా పూర్తి చేశారట. ఈ విషయాలని అంబికా కృష్ణ ఓ ఇంటర్వ్యూలోతెలియజేశారు. మరి ఇంతకు ఆ దర్శకుడు ఎవరు అంటే వీరభద్ర మూవీ తెరకెక్కించిన రవికుమార్ చౌదరి. బాలయ్య, తనుశ్రీ దత్తా, సదా ప్రధాన పాత్రలలో ఏఎస్ రవికుమార్ చౌదరి వీరభద్ర అనే చిత్రాన్ని తెరకెక్కించగా, ఈ మూవీని ప్రముఖ నిర్మాత అంబికా నిర్మించారు.
చిత్ర పరాజయం గురించి నిర్మాత అంబికా కృష్ణ ఓ సందర్భంలో మాట్లాడుతూ దర్శకుడిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. వీరభద్ర మూవీ ఫ్లాప్ కావడానికి పూర్తి కారణం దర్శకుడే అని అతడు పరమ నీఛుడు అంటూ మండిపడ్డారు. బాలకృష్ణ లాంటి స్టార్ హీరో డేట్లు ఇస్తే ఎంత జాగ్రత్తగా ఉండాలి ? కానీ అహంకారంతో ఇష్టం వచ్చినట్లు చేస్తూ, విపరీతంగా డబ్బు ఖర్చు చేయించి సినిమా ఫ్లాప్ కి ముఖ్య కారకుడు అయ్యాడు. కొన్నిసార్లు తాగి మరీ షూటింగ్‌కి వచ్చాడు. వీర భద్ర వల్ల చాలా డబ్బు నష్టపోయాను. ఓ సారి నన్ను బాలయ్య పిలిపించి బాధపడకండి, మంచి దర్శకుడితో మరో కథ సిద్ధం చేయండని అన్నారు. కాని కుదరలేదు అని అంబికా స్పష్టం చేశారు. కాగా, ఏఎస్ రవికుమార్ చౌదరి యజ్ఞం, పిల్లా నువ్వు లేని జీవితం లాంటి హిట్ చిత్రాలని తెరకెక్కించిన విషయం తెలిసిందే.