ఇన్నాళ్లు వెండితెరపై రచ్చ చేసిన బాలకృష్ణ తొలిసారి ఒక టాక్ షోకు హోస్టింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. అన్‌స్టాపబుల్ షో ద్వారా సరికొత్తగా ఎంట్రీ ఇచ్చిన బాలయ్య తొలి షోలో అదరగొట్టాడు. మోహన్ బాబుతో కలిసి తెగ సందడి చేశారు. ఇద్దరు కలిసి సినిమాలు, రాజకీయాలు, పార్టీలు ఇలా పలు విషయాలపై మాట్లాడి అభిమానులకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించారు. ఇక రెండో ఎపిసోడ్లో ఎవరిని ఇంటర్వ్యూ చేయనున్నాడనే అనుమానాలు ఉండగా, దానిపై క్లారిటీ వచ్చింది.
నేచురల్ స్టార్ నానితో బాలకృష్ణ టాక్ షో ఉంటుందని తాజాగా కన్ఫాం చేశారు. నాని, బాలకృష్ణ ఫొటోలను విడుదల చేస్తూ రెండో ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో సాయంత్రం 5.04ని.లకు రానుందని పేర్కొన్నారు. మరి ఈ ఎపిసోడ్లో బాలకృష్ణ ఏయే విషయాలని అడుగుతాడు, నాని నుండి ఎలాంటి విషయాలు రాబడతాడని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నాని ఇప్పటికే బిగ్ బాస్ హోస్ట్ చేయగా, ఇప్పుడు గెస్ట్ సీట్లో కూర్చొని ఎలాంటి ఎంటర్టైన్మెంట్ అందిస్తాడో చూడాలి.
ప్రతి మనిషి జీవితంలో ఒక ప్రయాణం ఉంటుంది. రాయికి ఎన్నో దెబ్బలు తగిలితేనే శిల్పం అవుతుంది. అలాగే ప్రతి మనిషి జీవితంలో ఎత్తు పల్లాలుంటాయి. వాటిని అధిగమించి ఒక లక్ష్యాన్ని చేరడమే ‘అన్‌స్టాపబుల్’ అని బాలకృష్ణ పేర్కొన్న విషయం విదితమే. తదుపరి ఎపిసోడ్‌కి నాగబాబు గెస్ట్‌గా వచ్చినట్టు తెలుస్తుంది.