ఆరుపదుల వయస్సులోను బాలకృష్ణ ఫుల్ జోష్‌లో కనిపిస్తున్నారు. ఒకవైపు సినిమాలు మరోవైపు రియాలిటీ షోలతో తెగ సందడి చేస్తున్నారు. తొలిసారి ఆహా కోసం హోస్ట్‌గా మారిన బాలకృష్ణ పలువురు ప్రముఖులని తనదైన స్టైల్లో ఇంటర్వ్యూలు చేస్తున్నాడు. తొలి ఎపిసోడ్‌ను మంచు మోహన్‌బాబు ఫ్యామిలీతో చిత్రీకరించారు. ఇందులో మంచు మోహన్‌బాబు, లక్ష్మీ ప్రసన్న, విష్ణు పాల్గొనగా..వారిని బాలకృష్ణ ప్రశ్నలడిగారు.
తన రెండో ఎపిసోడ్ కి గెస్ట్ గా న్యాచురల్ స్టార్ నాని హాజరయ్యారు. దీనికి సంబంధించిన ప్రోమో రీసెంట్గా విడుదలైంది. “మీ నుంచే వచ్చాడు.. మీలోనే ఉన్నాడు” అంటూ నానిని షోకి బాలకృష్ణ ఆహ్వానించాడు. సరదా డైలాగ్స్ తో పాటు చిన్నచిన్న గేమ్స్ ఆడుతూ బాలయ్యతో పాటు నాని ప్రేక్షకులను నవ్వించబోతున్నట్లు ప్రోమో చూస్తేనే అర్ధమవుతుంది. ఫుల్ ఎపిసోడ్ నవంబర్ 12న “ఆహా” ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విడుదల కానుంది.
అయితే తాజాగా బాలకృష్ణ అన్‌స్టాపబుల్ టాక్ షో వేదికపై చిందులు వేసిన వీడియోని ఆహా విడుదలచేసింది. ఇందులో పూర్ణతో కలిసి బాలకృష్ణ ఫుల్ జోష్‌తో డ్యాన్స్ చేశాడు. ఈ వీడియో చూసి బాలకృష్ణకి 61 సంవత్సరాలు అంటే నమ్మబుద్ది కావడం లేదనే కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం వైరల్ అయిన ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.