Bahubali-2 Movie Collections | తెలుగు సినిమాను వర్ణించాలంటే బాహుబలి సినిమాకు ముందు బాహుబలి సినిమా తర్వాత అనే విధంగా టాలీవుడ్ ప్రేక్షకులు చెప్పుకుంటారు అప్పటివరకు తెలుగు సినిమాలపై చిన్న చూపు చూసిన హిందీ ప్రేక్షకులు బాహుబలి టిక్కెట్ల కోసం కొట్టుకున్నారు. రాజమౌళి దర్శకత్వ ప్రతిభకు దేశం మొత్తం జైజైలు పలికారు. ఇక బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా సృష్టించిన రికార్డులు అంతా ఇంతా కాదు. బాహుబలితో తెలుగు సినిమాకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన జక్కన్న.. బాహుబలి-2తో ఇంటర్నేషనల్ లెవల్‌కు తీసుకెళ్లాడు. రాజమౌళి టేకింగ్, ప్రభాస్ నటనకు జనాలు వెర్రెత్తిపోయారు. రానా విలనిజంకు ఫిదా అయ్యారు. ఇలా ఒక్కరిద్దరూ కాదు సినిమాలోని ప్రతీ నటుడు ది బెస్ట్ ఇచ్చారు. అప్పటివరకు రెండొందల కోట్లు కూడా దాటని టాలీవుడ్ సినిమా బాహుబలితో ఏకంగా వెయ్యి కోట్ల క్లబ్లో చేరి చరిత్ర సృష్టించింది. ఇప్పటికీ ఇండియాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమా రికార్డు బాహుబలి-2 పేరిటే ఉంది. కాగా శుక్రవారంతో ఈ సినిమా ఆరేళ్లు పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమా ఫైనల్ రన్లో ఎంత వసూళు చేసిందో ఓ లుక్కేద్ధాం.
నైజాం- 66.90 కోట్లు
సీడెడ్- 34.78 కోట్లు
ఉత్తరాంధ్ర- 26.47 కోట్లు
ఈస్ట్- 17.04 కోట్లు
వెస్ట్- 12.31 కోట్లు
గుంటూరు- 18.01 కోట్లు
కృష్ణా- 14.10 కోట్లు
నెల్లూరు- 8.04 కోట్లు
ఏపీ + తెలంగాణ (టోటల్)-197.65 కోట్లు
కర్ణాటక- 62.00 కోట్లు
తమిళనాడు- 81.00 కోట్లు
కేరళ- 32.12 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా- 281.05 కోట్లు
ఓవర్సీస్- 160.28 కోట్లు
వరల్డ్ వైడ్ (టోటల్)- 814.10 కోట్లు
‘బాహుబలి2’ సినిమాకు అప్పట్లో దాదాపు రూ. 350 కోట్ల బిజినెస్ జరిగింది. అప్పట్లో ఇంత వస్తుందా అని అంతా కంగారు పడ్డారు కానీ విడుదలైన తర్వాత ఈ చిత్ర ప్రభంజనం చూసి అంతా నోరెళ్లబెట్టుకున్నారు. ఒకటి రెండు కాదు.. ఏకంగా రూ.450 కోట్లకు పైగా లాభాలు తీసుకొచ్చి బాహుబలి-2 సంచలనం సృష్టించింది. కేవలం థియేట్రికల్ కలెక్షన్స్ రూపంలోనే రూ.814 కోట్లకు పైగా వచ్చాయి. రూ.1800 కోట్ల గ్రాస్ వసూలు చేసిన తొలి ఇండియన్ సినిమా కూడా ఇదే.