కిషోర్తేజ, భవ్యశ్రీ జంటగా నటిస్తున్న చిత్రం ‘బాగుంది’. రామ్‌కుమార్ దర్శకుడు. శ్రీసాయి ప్రొడక్షన్స్ పతాకంపై రాజనేని వెంకటేశ్వర రావు, డా॥ మహేంద్రబాబు నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను దర్శకుడు వేణు ఊడుగుల ఆవిష్కరించారు. ఫస్ట్‌లుక్‌ను తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు ఆర్.కె.గౌడ్ లాంచ్ చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. ఆద్యంత ఉత్కంఠగా సాగుతుంది.
ప్రేమకథ కూడా మెప్పిస్తుంది. కథానుగుణంగా మంచి పాటలు కుదిరాయి’ అన్నారు. శ్రీరామోజు, వంశీకృష్ణ, విజయ్ భాస్కర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రాజు శేషన్న కిట్టు, సంగీతం: హర్ష ప్రవీణ్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రామ్ కుమార్.