Bagheera Movie | ‘కేజీఎఫ్’, ‘సలార్’ చిత్రాల ఫేమ్ ప్రశాంత్ నీల్ మరో క్రేజీ మూవీతో రాబోతున్నాడు. ఆయన స్టోరీ అందిస్తున్న తాజా చిత్రం బఘీరా(Bagheera). కన్నడ రోరింగ్ స్టార్ శ్రీమురళి హీరోగా వస్తున్న ఈ చిత్రంలో సప్త సాగరాలు దాటి ఫేమ్ రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తుంది. ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. ఈ సినిమాకు డాక్టర్ సూరి దర్శకత్వం వహిస్తుండగా.. ‘కేజీఎఫ్’, కాంతారా చిత్రాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది.
ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే శ్రీమురళి రెండు పాత్రలతో అలరించబోతున్నట్లు తెలుస్తుంది. ఇందులో ఒకటి పోలీస్ పాత్ర కాగా.. మరోకటి ‘బఘీరా’ అనే సూపర్ హీరో పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఫుల్ యాక్షన్ ప్యాక్డ్గా ఉన్న ఈ ట్రైలర్ కేజీఎఫ్ తరహాలో ఉండగా.. మాస్ సినిమాలు అభిమానించేవారికి ఫుల్ మీల్స్ అని తెలుస్తుంది. ఈ సినిమాను తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు.