‘కేజీఎఫ్’ ఫేమ్ దర్శకుడు ప్రశాంత్‌నీల్ కథనందించిన చిత్రం ‘బఘీర’. శ్రీమురళి హీరోగా నటించిన ఈ చిత్రానికి సూరి దర్శకుడు. హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. ఈ నెల 31న విడుదలకానుంది. సోమవారం థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. దేవుడి అవతారాల గురించి తల్లి, కొడుకు మధ్య సంభాషణతో ట్రైలర్ ఆసక్తికరంగా మొదలైంది. అరాచకాలను అంతం చేయడానికి దేవుడు అనేక రూపాల్లో వస్తాడని, రాక్షసుడిగా కూడా రావొచ్చని తల్లి చెబుతుంటుంది.
అనంతరం నేరస్థులను మట్టుబెడుతున్న మాస్క్ మ్యాన్ బఘీర కోసం పోలీసుల వేటతో ట్రైలర్ ఉత్కంఠను పంచింది. శ్రీమురళి పోలీస్ అధికారిగా, మాస్క్ మ్యాన్‌గా డిఫరెంట్ షేడ్స్‌తో కూడిన పాత్రలో కనిపించారు. రుక్మిణి వసంత్, ప్రకాష్‌రాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: బి.అజనీష్ లోక్‌నాథ్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: డాక్టర్ సూరి.