Cinema News | కన్నడ హీరో శ్రీమురళి హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటైర్టెనర్ ‘బఘీర’. అగ్రదర్శకుడు ప్రశాంత్‌నీల్ కథ అందించారు. డాక్టర్ సూరి దర్శకుడు. విజయ్ కిరగందూర్ నిర్మాత. ఈ నెల 31న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా రెండో పాటను మేకర్స్ విడుదల చేశారు. ‘పరిచయమేలె పరిచయమేలె నిజముగ మారె కలలే..’ అంటూ సాగే ఈ పాటను రాంబాబు గోసాల రాయగా, బి.అజనీష్ లోక్‌నాథ్ స్వరపరిచారు. రితేష్ జి.రావు ఆలపించారు.
హీరోహీరోయిన్ల కెమిస్ట్రీని ఈ పాటలో అందంగా ఆవిష్కరించారు. మహిళలకు హాని కలిగించేవారిపై కఠిన చర్యలు తీసుకొనే టఫ్ పోలీస్‌గా ఈ పాటలో శ్రీమురళి కనిపిస్తుంటే, సున్నితమైన మనస్తత్వం కలిగిన డాక్టర్‌గా రుక్మిణి దర్శనమిస్తున్నది. రెండు భిన్నవ్యక్తిత్వాల ప్రేమను ఈ పాట ఆవిష్కరించింది. ప్రకాశ్‌రాజ్, రంగాయణరఘు, అచ్యుత్‌కుమార్, గరుడరామ్ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: ఏ.జె.శెట్టి, విడుదల: ఏషియన్ సురేష్ ఎంటైర్టెన్మెంట్ ఎల్ఎల్పి.