Badmashulu OTT | యువ నటులు మహేశ్ చింతల, విద్యాసాగర్ కారంపూరి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘బద్మాషులు’ (Badmashulu). ఈ సినిమాకు శంకర్ చేగూరి దర్శకత్వం వహించగా.. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడూ ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్ (Etv Win)లో ఈ చిత్రం ఆగష్టు 08 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
పల్లెటూరి నేపథ్యంలో జరిగే ఈ సినిమా కథ విషయానికి వస్తే.. కోతులగూడెం అనే గ్రామానికి చెందిన బార్బర్ ముత్యాలు (విద్యాసాగర్ కారంపురి), తిరుపతి (మహేశ్ చింతల) చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. ఊర్లో వీరిద్దరూ ఏ పనిపాటూ లేకుండా తిరుగుతుంటారు. దీంతో ఊర్లో వాళ్ళు అందరూ వీరిని బద్మాషులు అని పిలుస్తారు. ఈ క్రమంలోనే ఈ బద్మాషులు ఒకరోజు ఒక స్కూల్లో ఒక కంప్యూటర్ని దొంగతనం చేస్తారు. అయితే, ఆ కంప్యూటర్లో ఆ స్కూల్ పూర్వ విద్యార్థుల డేటా ఉంటుంది. ఆ కంప్యూటర్ని వాళ్లిద్దరూ ఎందుకు దొంగతనం చేశారు? ఆ డేటా చివరికి ఏమైంది? అనేది ఈ సినిమా కథ.
🤣 Fun, friendship & full-on comedy!#Badmashulu streaming from Aug 8th on @etvwin pic.twitter.com/JTjsPiYmfz
— ETV Win (@etvwin) August 5, 2025