Bade Miyan Chote Miyan | బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ (Akshaykumar), టైగర్ ష్రాఫ్ (Tigershroff) ప్రధాన పాత్రల్లో వచ్చిన తాజా చిత్రం ‘బడే మియాన్ చోటే మియాన్’ (Bade Miyan Chote Miyan). ఈ సినిమాకు ఏక్ థా టైగర్, సుల్తాన్ సినిమాల ఫేమ్ అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించగా.. మానుషి చిల్లర్, సోనాక్షి సిన్హా కథనాయికలుగా నటించారు. సుమారు రూ.350 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం చవి చూసింది. కేవలం రూ.64కోట్ల వసూళ్లే రాబట్టి డిజాస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ లాక్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో జూన్ 06 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో విలన్‌గా నటించాడు.