నాగశౌర్య కథానాయకుడిగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘బ్యాడ్‌బాయ్ కార్తీక్’. రామ్ దేశిన దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని శ్రీవైష్ణవి ఫిల్మ్స్ పతాకంపై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మిస్తున్నారు. సోమవారం ఈ చిత్రం నుంచి ‘అందమైన ఫిగరు నువ్వా’ అనే పాటను విడుదల చేశారు. హారిస్ జైరాజ్ స్వరపరచిన ఈ పాటను కృష్ణకాంత్ రచించారు. శ్రీధర్ సేన, ప్రియా జెర్సన్ ఆలపించారు.
ఈ పాటలో నాయకానాయికలు నాగశౌర్య, విధి మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉంది. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సముద్రఖని, నరేష్ వీకే, సాయికుమార్, మైమ్ గోపి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హారిస్ జైరాజ్, రచన-దర్శకత్వం: రామ్ దేశిన (రమేష్).