Telugu Movies | ఈ వారం వరుస సినిమాలు..కానీ క్రేజ్ మాత్రం నిల్..!
ఈ వారం మరో అరడజన్ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. కాకపోతే వాటిలో ఏ ఒక్క సినిమాలోను స్టార్స్ లేరు. దాంతో అందులో సగం సినిమాలు వస్తున్నట్టు కనీసం ప్రేక్షకులకు ఐడియా కూడా లేదు.
తెలుగు ఇండస్ట్రీ (Telugu Industry)కి ఇప్పుడిప్పుడే టైం బాగా కలిసి వస్తుంది. గత మూడు వారాల్లో మూడు ఘన విజయాలు టాలీవుడ్ ను పలకరించాయి. బాక్సాఫీస్ దగ్గర ఆ సినిమాలు సంచలన వసూళ్లు సాధించడంతో నిర్మాతలు సంతోషంగా ఉన్నారు. ఆగస్టు 5న విడుదలైన బింబిసారా (Bimbisara), సీతారామం (SitaRamam) సినిమాలు ఇప్పటికే బ్లాక్ బస్టర్ స్టేటస్ అందుకున్నాయి. తాజాగా గత వారం విడుదలైన కార్తికేయ 2 (Karthikeya 2) కూడా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా హిందీలో కూడా అద్భుతమైన కలెక్షన్స్ సాధిస్తుండడం శుభ పరిణామం.
ఇదిలా ఉంటే ఇదే ఊపులో ఈ వారం మరో అరడజన్ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. కాకపోతే వాటిలో ఏ ఒక్క సినిమాలోను స్టార్స్ లేరు. దాంతో అందులో సగం సినిమాలు వస్తున్నట్టు కనీసం ప్రేక్షకులకు ఐడియా కూడా లేదు. ఆగస్టు 18న ధనుష్ హీరోగా నటించిన ‘తిరు’ విడుదల కానుంది. ఈ సినిమాపై ఆసక్తి బాగానే ఉంది. తెలుగులో ఏషియన్ ఫిలిమ్స్ ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.
ఆగస్టు 19న ఆది సాయికుమార్ హీరోగా నటించిన తీస్మార్ ఖాన్ (Tees Maar Khan)..రాఘవేంద్రరావు నిర్మించిన ‘వాంటెడ్ పండుగాడ్’ సినిమాలతో పాటు అం అః, తేజస్వి మదివాడ నటించిన కమిట్మెంట్ సినిమాలు విడుదల కానున్నాయి. వీటిలో స్టార్ క్యాస్ట్ ఉన్న సినిమా ధనుష్ ‘తిరు’ మాత్రమే. ఇక ఆది నటించిన తీస్మార్ ఖాన్ సినిమా ప్రమోషన్స్ కూడా బాగానే చేస్తున్నారు. మరి వీటిలో ఈ వారం ఏ సినిమా ప్రేక్షకులు ఆకట్టుకుంటుందో చూడాలి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

