Bachelor Party | కన్నడ స్టార్ హీరో సప్త సాగరాలు దాటి (Sapta Sagaralu Dhaati) ఫేమ్ రక్షిత్ శెట్టి సొంత ప్రోడక్షన్ సంస్థ పరమవా స్టూడియోస్ బ్యానర్ నుంచి వచ్చిన తాజా చిత్రం ‘బ్యాచిలర్ పార్టీ’ (Bachelor Party). అభిజిత్ మహేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దిగంత్, అచ్యుత్ కుమార్, యోగి, సిరి రవికుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా జనవరి 26న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం అందుకుంది. ఇదిలావుంటే తాజాగా ఈ చిత్రం ఓటీటీ లాక్ చేసుకుంది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా మార్చి 04 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ ఓటీటీ స్ట్రీమింగ్ అనేది కేవలం కన్నడ వరకే ఉంటుందా? తెలుగు డబ్బింగ్ కూడా అందుబాటులోకి తీసుకొస్తారా అనేది తెలియాల్సి ఉంది. పరమ్ వహ్ స్టూడియోస్ బ్యానర్‌పై రక్షిత్ శెట్టి, జీఎస్ గుప్తా నిర్మాతలుగా వ్యవహరించారు.
Join the chaotic trio in their adventure! ‘Bachelor Party’ streaming on Amazon Prime from Monday✨♥️ pic.twitter.com/g57XxTD05k
— Paramvah Studios (@ParamvahStudios) March 2, 2024