విజయదశమి బరిలో బ్యాచ్‌లర్

‘పెళ్లి గురించిన ఎన్నో కలలతో ఇండియాలోకి అడుగుపెడతాడు ఓ ప్రవాస యువకుడు. తనకు మనసుకు నచ్చిన అందాలభరిణె కోసం అన్వేషించడం మొదలుపెడతాడు. ఆతని ప్రయత్నాలు ఫలించి ఓ చలాకీ చిన్నది అతని జీవితంలోకి ఎంటరవుతుంది. అయితే భిన్న ధృవాల్లాంటి వ్యక్తిత్వం కలిగిన ఈ జంట ప్రేమాయణం అంత సాఫీగా సాగదు. ఈ క్రమంలో తన పెళ్లి స్వప్నాన్ని సాకారం చేసుకునేందుకు బ్యాచ్‌లర్ ఎలాంటి ప్రయత్నాలు చేశాడో తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే’ అంటున్నారు బొమ్మరిల్లు భాస్కర్. ఆయన దర్శకత్వంలో అఖిల్ అక్కినేని, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్‌బ్యాచ్‌లర్’. బన్నీ వాసు, వాసువర్మ నిర్మాతలు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 15న విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ‘ఆహ్లాదభరిత ప్రేమకథా చిత్రమిది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌కు అద్భుతమైన స్పందన లభిస్తున్నది. అఖిల్‌ను మునుపటి కంటే భిన్నంగా కొత్త పంథాలో ఆవిష్కరించే చిత్రమవుతుంది’ అని నిర్మాతలు తెలిపారు. ఆమని, మురళీశర్మ, జయప్రకాష్, ప్రగతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ప్రదీశ్ ఎమ్ వర్మ, సంగీతం: గోపీసుందర్, నిర్మాణ సంస్థ: జీఏ2పిక్చర్స్, సమర్పణ: అల్లు అరవింద్, దర్శకుడు: బొమ్మరిల్లు భాస్కర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- bachelor
- vijayadashami
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

