Farhad Samji | రామ్ చరణ్ టీమ్‌లో ‘బచ్చన్ పాండే’ డైరెక్టర్..!
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 15వ (RC 15) సినిమా విశేషాలు మెగా ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేస్తున్నాయి. పొలిటికల్, బ్యూరోక్రసీ అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్ వచ్చేసింది.
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 15వ (RC 15) సినిమా విశేషాలు మెగా ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేస్తున్నాయి. ఈ చిత్రానికి శంకర్ (Shankar) దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు నిర్మాత. తన 50వ సినిమాగా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పొలిటికల్, బ్యూరోక్రసీ అంశాలతో దర్శకుడు శంకర్ తన శైలి చిత్రంగా ఆర్సీ 15ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఇటీవల రాజమండ్రి పరిసరాల్లో షూటింగ్ జరుపుకుంది.
ఈ చిత్రంలో రామ్ చరణ్ (Ram Charan) ద్విపాత్రాభినయం చేస్తారనే వార్తలూ వస్తున్నాయి. ఈ సినిమాలో కియారా అద్వానీ నాయికగా నటిస్తున్నది. ఇతర పాత్రల్లో సునీల్, అంజలి, జయరామ్ కనిపించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్ వచ్చేసింది. బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ తో హౌస్ ఫుల్ 4 చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు ఫర్హాద్ సమ్జీ (Farhad Samji) రామ్ చరణ్ కొత్త సినిమా హిందీ వెర్షన్ సంభాషణలు అందించబోతున్నారు.
Read ALso : The Kashmir Files | అనుపమ్ ఖేర్ ప్రతీ రోజూ ఏడ్చేవారు.. ‘ది కశ్మీర్ ఫైల్స్’ నిర్మాత
ఆయన సంగీత దర్శకుడు, రచయిత కూడా. తాజాగా అక్షయ్ కుమార్ తో బచ్చన్ పాండే అనే చిత్రాన్ని రూపొందించారు. తెలుగులో మాటలను బుర్రా సాయిమాధవ్ రాస్తుండగా..హిందీలో ఫర్హాద్ అందిస్తే అక్కడి ఆడియెన్స్ కు రీచింగ్ బాగుంటుందని దర్శకుడు భావించారు. శంకర్, రామ్ చరణ్, దిల్ రాజు ప్రాజెక్ట్ కాబట్టి ఫర్హాద్ కూడా ఓకే చెప్పారట.
అక్షయ్ కుమార్ తో సినిమాలు చేస్తున్న దర్శకుడిని సంభాషణలు రాసేందుకు ఎంచుకోవడం చూస్తే రామ్ చరణ్-శంకర్ సినిమా ఎంత భారీగా తెరకెక్కుతోందో అర్థం చేసుకోవచ్చు. బాలీవుడ్‌కు ఈ సినిమా ఒక స్థానిక చిత్రంగా తీసుకెళ్లాలనే ఈ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఉన్నారు.
Read ALso : Liger Team | పుట్టినరోజు వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్‌గా ‘లైగర్’ టీం..వీడియో వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
attack on bus | జమ్ముకశ్మీర్ బస్సుపై రాళ్లతో దాడి.. డ్రైవర్‌ను ఉగ్రవాదిగా పేర్కొన్న వ్యక్తులు
BRS Leaders | కష్ట కాలంలో అండగా బీఆర్ఎస్.. అధినాయకులపై ప్రత్యేక అభిమానం చాటుకుంటున్న రవీందర్
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
మహేశ్ కుమార్ గౌడ్, పొంగులేటి, గడ్డం వంశీకృష్ణకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

