Baby Bump | టాలీవుడ్లో వెన్నెల సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన పార్వతి మెల్టన్, జల్సా మూవీలో పవన్ కళ్యాణ్ సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత గేమ్, అల్లరే అల్లరి, మధుమాసం వంటి సినిమాల్లో నటించినప్పటికీ, జల్సా మూవీ మాత్రమే ఆమెకు పేరు తీసుకువచ్చింది. అయితే ఆ సినిమాలో ఇలియానా మెయిన్ హీరోయిన్గా ఉండటంతో, పార్వతికి హీరోయిన్గా పెద్దగా పేరు రాలేదు. ఆ తర్వాత మహేష్ బాబు దూకుడు , బాలకృష్ణ శ్రీమన్నారాయణ వంటి సినిమాల్లో ఐటమ్ సాంగ్స్‌లో హొయలు పోయింది. అనంతరం సినీ రంగానికి దూరమై, 2012లో అమెరికాలోని ఓ బిజినెస్ మ్యాన్‌ను వివాహం చేసుకుని అక్కడే సెటిల్ అయ్యింది.
ఇటీవల పార్వతి మెల్టన్ పెళ్లైన 13 ఏళ్ల తర్వాత తల్లి కాబోతున్నానని ఆనందకరమైన వార్తను అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ప్రెగ్నెంట్‌గా ఉన్న ఆమె బేబీ బంప్ ఫోటోషూట్ చేయించుకుని సోషల్ మీడియాలో షేర్ చేసింది. వైట్ డ్రెస్‌లో గర్భిణీ సౌందర్యాన్ని అద్దిన ఆమె తాజా ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానులు, “తల్లి అవుతున్నా కూడా హాట్నెస్ ఏమాత్రం తగ్గలేదు” అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి షాకింగ్ విషయాలు వెల్లడించిన ఆమె, “ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కొంతమంది డైరెక్టర్ల వల్లే నా కెరీర్ నాశనమైంది” అని చెప్పింది.
పేర్లు చెప్పకపోయినా, నెటిజన్లు మాత్రం కొన్ని పేర్లను సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు. ఇప్పుడు తల్లి కాబోతున్న ఆనందంలో ఉన్న పార్వతి మెల్టన్, బిడ్డ పుట్టిన తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇస్తుందా లేదా అనేది చూడాలి. అయితే పెళ్లైన 13 ఏళ్ల తర్వాత పార్వతి తల్లి కావడంతో ఈ అమ్మడు ఉపాసన రికార్డ్ బ్రేక్ చేసిందని కామెంట్ చేస్తున్నారు. రామ్ చరణ్- ఉపాసన దంపతలు కూడా చాలా ఏళ్ల తర్వాత పిల్లలని ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.