‘బాబు నెం 1 బుల్షిట్ గయ్’ చిత్రం ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ‘బేబీ’ చిత్ర నిర్మాత ఎస్కేఎన్, ‘బేబీ’ దర్శకుడు సాయిరాజేశ్, ప్రముఖ నిర్మాత వివేక్ కూచిభొట్ల ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరై చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు. ‘పాషన్‌తో చేసిన సినిమా ఇది. ప్రేక్షకులను ఉత్కంఠకు లోనుచేసే థ్రిల్లర్ డ్రామాగా దర్శకుడు లక్ష్మణవర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఫ్యామిలీతో కూర్చుని చూడదగ్గ యునిక్ కాన్సెప్ట్ ఇది’ అని హీరోహీరోయిన్లు అర్జున్ కళ్యాణ్, కుషిత కల్లపు చెప్పారు. నిర్మాత దండు దిలీప్‌కుమార్‌రెడ్డి ఖర్చుకు వెనుకాడకుండా ఇష్టంతో ఈ సినిమాను నిర్మించారని, యూనిట్ మొత్తం మనసుపెట్టి పనిచేశారుగనుకే సినిమా ఇంతబాగా వచ్చిందని దర్శకుడు చెప్పారు. మార్చి 8న ఈ చిత్రం విడుదల కానున్నదని నిర్మాత తెలిపారు. లక్ష్మణ్‌వర్మ, సోనాలి పాణిగ్రహి, మురళీధర్‌గౌడ్ ఇతరపాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: పీఎస్ మణికర్ణన్, సంగీతం: పవన్.