Fake Bollywood | దివంగత బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ తనయుడు బాబిల్ ఖాన్ తాజాగా బాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక వీడియోలో ఆయన బాలీవుడ్‌ను “అసభ్యకరమైన, “నకిలీ” పరిశ్రమగా అభివర్ణించారు. అంతేకాకుండా, అనన్యా పాండే, అర్జున్ కపూర్ వంటి పలువురు ప్రముఖ నటీనటులను “మర్యాదలేని” వారిగా పేర్కొన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బాబిల్ ఖాన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాను తొలగించారు.
ఆ వీడియోలో బాబిల్ ఖాన్ బాలీవుడ్లో తనకు ఎదురైన కొన్ని అనుభవాలను పంచుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. అనన్యా పాండే, శనాయా కపూర్, అరిజిత్ సింగ్ వంటి వారి పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ పరిశ్రమలోని కొన్ని వాస్తవాలను బయటపెట్టారు. అయితే, ఆ వాస్తవాలు ఏమిటనే దానిపై స్పష్టత లేదు. బాబిల్ ఖాన్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. బాలీవుడ్లో నెలకొన్న పరిస్థితులు, నటీనటుల మధ్య సంబంధాలు, పరిశ్రమలోని ఒత్తిడి వంటి అంశాలపై నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ విషయంపై బాలీవుడ్ నుండి ఇంకా ఎటువంటి అధికారిక స్పందన రాలేదు.
మరోవైపు బాబిల్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఒక సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చేసినట్లు తెలుస్తుంది. ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఆ తర్వాత ప్రమోషన్ అనడం ఫిల్మ్ ఇండస్ట్రీలో కామన్‌గా మారింది.
Bollywood is the FAKEST INDUSTRY says #BabilKhan in a video which he deleted within few mins.
Real or #Logout Promotion ⁉️ pic.twitter.com/yLlabDS8ta
— Pan India Review (@PanIndiaReview) May 4, 2025