Baahubali | ప్రస్తుతం రీరిలీజ్‌ల ట్రెండ్ టాలీవుడ్ చాలా ఎక్కువైంది. పాత సినిమాలని ప్రత్యేక సందర్భాలలో రిలీజ్ చేస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు తెలుగు సినిమాను ప్రపంచ వ్యాప్తి చేసిన బాహుబలి సినిమాని కూడా రీరిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మధ్య మహేష్ బాబు ఖలేజా రీరిలీజ్ చేయగా, ఈ మూవీకి భారీ స్పందన వచ్చింది. ఆ సినిమా సుమారు రూ.10 కోట్ల కలెక్షన్లను అందుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పటికీ ఖలేజా థియేటర్లలో ఆడుతుంది.అంతక ముందు ప్రభాస్ వర్షం సినిమా రాగా, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ క్రమంలోనే బాహుబలి సినిమాను కూడా రీరిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి ఫ్రాంచైజ్ రెండు భాగాలుగా విడుదలై, ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాల క్రేజ్ ఇప్పటికీ ఏ మాత్రం తగ్గలేదు.బాహుబలి సినిమాల రీరిలీజ్ చేస్తే బాగుంటుందని పలు సందర్భాలలో ఫ్యాన్స్ తమ అభిప్రాయాలు చెప్పుకొచ్చారు. బాహుబలి సినిమాలను అక్టోబర్ 2025లో థియేటర్లలో రీ రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.అయితే ఫ్యాన్స్ కోసం టీమ్ ఓ ప్లాన్ వేసింది.
బాహుబలి రెండు భాగాలను కలిపి ట్రిమ్డ్ వెర్షన్‌గా ప్రేక్షకుల ముందుకు తెచ్చే ఆలోచన చేస్తున్నారట. ఈ నిర్ణయం సినిమాను కొత్తగా అనుభవించాలనుకునే ప్రేక్షకులకు మరింత వినోదం అందిస్తుంది. బాహుబలి రెండు పార్టుల్లోని అనవసర సీన్స్ ను తీసేసి, బాగా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ ను మాత్రమే ఉంచి ఓ భాగంగానే రిలీజ్ చేయాలని చూస్తున్నారట. ఇప్పటికే ఎడిటింగ్ వర్క్స్ ను కూడా మొదలుపెట్టారని అంటున్నారు. ఈ వార్తలు నిజమైతే బాహుబలిని ఒకే కథగా ప్రేక్షకులకి ముందుకు వచ్చి రీరిలీజుల్లో కూడా ట్రెండ్ సృష్టించడం ఖాయం అంటున్నారు. బాహుబలి సినిమా తరువాత టాలీవుడ్ పేరు మారు మోగిపోయిన విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత ఎన్ని పాన్ ఇండియా సినిమాలు వచ్చినా.. బాహుబలి పేరు మాత్రం చరిత్రలో అలా నిలిచిపోతుంది.