గన్స్, గోల్డ్ చుట్టూ సాగే హంట్ నేపథ్యంలో.. ఓ ముగ్గురి ప్రయాణమే ప్రధాన ఇతివృత్తంగా తెరకెక్కనున్న న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ డ్రామా ‘బాబా బాబా బ్లాక్ షీప్’. టిను ఆనంద్, ఉపేంద్ర, జార్జ్ మరియన్, అక్షయ్ లగుసాని, విష్ణు, కార్తికేయ, విస్మయశ్రీ, మాళవి ప్రధాన పాత్రధారులు. గుణి మంచికంటి దర్శకుడు. వేణు దోణెపూడి నిర్మాత. దసరా సందర్భంగా ఈ సినిమా కాన్సెప్ట్‌ని పరిచయం చేస్తూ ఓ మోషన్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. క్రియేటివ్ డైరెక్టర్ తరుణ్‌భాస్కర్ ఈ పోస్టర్ని ఆవిష్కరించి చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందించారు.
ఇది ఒకే రోజులో జరిగే కథ అని, ఓ ముగ్గురి ప్రయాణం చుట్టూ ఈ కథ నడుస్తుందని, ఈ ప్రయాణంలో ఎదురయ్యే పరిస్థితులు, ఆ పరిస్థితుల్లోనుంచి పుట్టే కామెడీ, ఈ జర్నీలో జరిగే క్రైమ్ ఇవన్నీ ఆడియన్స్‌కు కొత్త అనుభూతిని కలిగిస్తాయని మేకర్స్ చెబుతున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్న ఈ చిత్రానికి కెమెరా: అజయ్ అబ్రహం జార్జ్, సంగీతం: స్టీఫెన్, ఆనంద్, సహనిర్మాత: కొండల్ జిన్నా, నిర్మాణం: చిత్రాలయం స్టూడియోస్.