Dream Girl 2 | బాలీవుడ్ (Bollywood)లో సక్సెస్ఫుల్ జర్నీ సాగిస్తున్న హీరోల్లో ఒకడు ఆయుష్మాన్ ఖురానా (Ayushmann Khurrana). ఈ టాలెంటెడ్ యాక్టర్ టైటిల్ రోల్లో నటించిన చిత్రం డ్రీమ్ గర్ల్. రాజ్ శాండిల్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడమే కాదు.. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఆయుష్మాన్ ఖురానా ఈ చిత్రంలో ఓ వైపు కరమ్‌వీర్ సింగ్‌గా, మరోవైపు పూజగా డ్యుయల్ షేడ్స్‌లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించాడు.
ఇప్పుడు సీక్వెల్ డ్రీమ్ గర్ల్ 2(Dream Girl 2) తో మరోసారి రెట్టింపు వినోదాన్ని పంచేందుకు రెడీ అంటున్నాడు ఆయుష్మాన్ ఖురానా. డ్రీమ్‌గర్ల్ కీ ప్రేమ్ కహాని పేరుతో విడుదల చేసిన వీడియోలో.. హలో నేను పూజా మాట్లాడుతున్నా.. మీరెవరు..? అంటూ గులాబీ రంగు చీరలో హొయలు పోతూ.. డ్రీమ్‌గర్ల్‌గా ఆయుష్మాన్ ఖురానా కలర్ ఫుల్ ఎంట్రీతో అదరగొట్టేస్తున్నాడు. డ్రీమ్ గర్ల్ రాకింగ్ సర్ప్రైజ్తో ఆగస్టు 25న థియేటర్లలో సందడి చేయబోతున్నట్టు తెలియజేస్తూ.. ఏక్తాకపూర్ షేర్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.
కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో లైగర్ ఫేం అనన్యపాండే ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. పరేశ్ రావల్, అన్నూ కపూర్, విజయ్ రాజ్, రాజ్ పాల్ యాదవ్, సీమా పహ్వా, ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏక్తా కపూర్, శోభా కపూర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నాలుగు సంవత్సరాల తర్వాత మీ సెల్‌ఫోన్ మళ్లీ రింగ్ అవుతుంది.. అంటూ డ్రీమ్ గర్ల్ వాయిస్ ఓవర్‌తో అందించిన రిలీజ్ అప్డేట్ ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
డ్రీమ్‌గర్ల్ కీ ప్రేమ్ కహాని..