Dream Girl-2 Teaser | వాస్తవికతను ప్రతిబింబించే కథాంశాల్ని ఎంచుకుంటూ బాలీవుడ్ సినీరంగంలో హీరోగా వైవిధ్యతను చాటుకుంటున్నాడు ఆయుష్మాన్ ఖురానా. ఫలితంతో సంబంధంలేకుండా ప్రేక్షకులకు కొత్త కథలను పరిచయం చేయడంలో ఆయన ముందు వరుసలో ఉంటాడు. కెరీర్ బిగెనింగ్ నుండి ఆయుష్మాన్ కంటెంట్ ఉన్న సినిమాలను చేస్తూ వస్తున్నాడు. కాగా గత రెండేళ్లుగా ఆయుష్మాన్‌ను ఫ్లాపులు వెంబటిస్తున్నాయి. ఇక గతేడాది ఏకంగా ఆయుష్మాన్ నటించిన మూడు సినిమాలు విడుదలయితే అందులో ఏ ఒక్కటి కూడా హిట్టు కాకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఆయన మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు.
ఈ క్రమంలోనే తన కెరీర్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన డ్రీమ్ గర్ల్ సీక్వెల్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. 2019లో వచ్చిన డ్రీమ్ గర్ల్ ఆయుష్మాన్ కెరీర్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది. కేవలం రూ. 28కోట్ల బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా ఫైనల్ రన్లో రూ.150 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించి ఔరా అనిపించింది. ప్రస్తుతం అదే సక్సెస్ ఫార్ములాతో ఆయుష్మాన్ డ్రీమ్ గర్ల్-2తో వస్తున్నాడు. రాజ్ శండియాలా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది.
కాగా వాలెంటైన్స్ డే సందర్భంగా మంగళవారం ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. తొలిపార్టులో లేడీ వాయిస్‌తో నవ్వించిన ఆయుష్మాన్ ఈ సారి ఏకంగా లేడీ గెటప్‌తోనే వచ్చాడు. టీజర్లో ఆయుష్మాన్ ఫేస్ రివీల్ చేయలేదు గానీ, లెహంగాలో అచ్చం అమ్మాయిని తలపించే గెటప్‌తో ఉన్నాడు.
టీజర్లో షారుఖ్,ఆయుష్మాన్‌కు కాల్ చేసి.. పూజా నేను పఠాన్ మాట్లాడుతున్నాను. హ్యాపీ వాలెంటైన్స్ డే. నా జవాన్ వచ్చేస్తుంది. మరి నువ్వెప్పుడు వస్తున్నావ్ అంటూ షారుఖ్ రిలీజ్ డేట్‌ను అడుగుతాడు. దానికి ఆయుష్మాన్ జూలై 7న వస్తున్నా అంటూ చెప్తుంది. ఇలా షారుఖ్ ఫోన్ కాల్‌తో టీజర్‌ను మేకర్స్ డిఫరెంట్‌గా కట్ చేశారు.కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆయుష్మాన్‌కు జోడీగా అనన్య పాండే హీరోయిన్గా నటిస్తుంది. బాలాజీ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఏక్తాకపూర్, శోభా కపూర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.
BREAKING NEWS: @Pooja_DreamGirl is back!#7KoSaathMein dekhenge! 😜#DreamGirl2 releasing in cinemas on 7th July, 2023.@writerraj @ananyapandayy @EktaaRKapoor @balajimotionpic pic.twitter.com/hW9xSwHrlq
— Ayushmann Khurrana (@ayushmannk) February 13, 2023