Adipurush | తిరుపతిలోని తారకరామ స్టేడియంలో ఆదిపురుష్ (Adipurush) ప్రీ రిలీజ్ ఈవెంట్ మరికొద్దిసేపట్లో గ్రాండ్‌గా షురూ కానుంది. ఇప్పటికే ప్రభాస్ (Prabhas)పంచెకట్టులో సరికొత్తగా కనిపిస్తూ సందడి చేస్తున్న ఫొటోలు, విజువల్స్ అభిమానులను ఖుషీ చేస్తున్నాయి. కాగా ఈవెంట్లో ప్రఖ్యాత ఆలయం అయోధ్య రామమందిరాన్ని రీక్రియేట్ చేసేలా ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. దీని కోసం ప్రత్యేక సెట్ కూడా వేశారు. ఆదిపురుష్ ఈవెంట్లో రామమందిర్ (Ram Mandir) రీక్రియేషన్ ఎలా ఉండబోతుందో తెలియజేసే స్టిల్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
మరోవైపు ఈవెంట్లో 50 అడుగుల పొడవైన ప్రభాస్ హోలోగ్రాఫిక్ ఇమేజ్ డిస్ప్లే చేసేలా కూడా ఏర్పాట్లు చేశారు మేకర్స్. ఈ ప్రదర్శనతో పాటు 100 మందికి పైగా డ్యాన్సర్లు, 100 మంది గాయకులు వేదికపై ప్రత్యేక ప్రదర్శనల మధ్య హోలోగ్రాఫిక్ చిత్రాన్ని ప్రదర్శించబోతున్నారు. ఈవెంట్‌కు హాజరైన వారందరికీ అపూర్వమైన, మరపురాని అనుభూతిని అందించేలా ప్రశాంత్ వర్మ టీం ప్లాన్ చేసుకుంది.
మైథలాజికల్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంలో ఆదిపురుష్‌లో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించబోతుండగా.. బాలీవుడ్ భామ కృతిసనన్ సీత పాత్రలో నటిస్తోంది. సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడి (లంకేశ్)గా నటిస్తున్నాడు. ఆదిపురుష్‌లో లక్ష్మణుడిగా సన్నీ సింగ్.. దేవ్‌దత్తా నగే హనుమంతుడి పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని టీ సిరీస్, రెట్రోఫైల్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. సాచెట్-పరంపర ఆదిపురుష్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆదిపురుష్ జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
Adipurush1
Adipurush2