Ayesha Khan | టాలీవుడ్లో దూసుకుపోతున్న బాలీవుడ్ బ్యూటీ ఆయేషా ఖాన్. హిందీ బిగ్‌బాస్ ద్వారా వచ్చిన క్రేజ్‌తో తెలుగులో చక్కటి అవకాశాలను అందుకుంటున్నది ఈ నటి! ఇక సోషల్ మీడియాలో ఆయేషా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ‘ఓం భీమ్ బుష్’ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఆయేషా. గ్లామర్‌తో నెట్టింట హీట్ పుట్టిస్తున్న ఈ భామ గురించి మరిన్ని సంగతులు..

ముంబయిలో పుట్టిన ఆయేషా బుల్లితెరపై జూనియర్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్ మొదలుపెట్టింది. ‘బాలవీర్ రిటర్న్స్’తో మంచి గుర్తింపు పొందింది. తర్వాత వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ తన ప్రత్యేకత నిరూపించుకుంది. హిందీ బిగ్‌బాస్‌తో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ఆయేషా బాలీవుడ్ టు టాలీవుడ్ జర్నీ కొనసాగిస్తున్నది.
‘ముఖచిత్రం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఆయేషా కొన్నాళ్లు సీరియల్స్‌కే పరిమితమైంది. బిగ్‌బాస్ తర్వాత వరుస అవకాశాలు దొరకబుచ్చుకుంటున్నది. ప్రస్తుతం టాలీవుడ్‌పై ఫోకస్ చేసింది. విశ్వక్సేన్ హీరోగా రాబోతున్న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లో ఐటం సాంగ్‌లో అదరగొట్టింది. దుల్కర్ సల్మాన్ చిత్రం ‘లక్కీ భాస్కర్’లో మరో స్పెషల్ సాంగ్‌లో కనువిందు చేయనుంది.
సోషల్ మీడియాలో ఆయేషాకు ఫాలోవర్లు ఎక్కువ. తరచూ హాట్ ఫొటోలు, వీడియోలు పోస్టు చేస్తుంటుంది. పాటలకు రీల్స్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటుంది. సందేశాత్మక వీడియోలు కూడా పోస్టు చేస్తుంటుంది.
‘ఓం భీమ్ బుష్’తో మంచి హిట్ సొంతం చేసుకున్న ఈ అమ్మడు త్వరలో మరో రియాలిటీ షోలో పాల్గొననుంది. రోహిత్ శెట్టి హోస్ట్ చేస్తున్న ‘కత్రోన్ కే ఖిలాడీ’ సీజన్ 14లో ఆమె కనిపించనుంది.