Avneet Kaur | ఇన్‌స్టాగ్రామ్‌లో నటుల పోస్ట్‌లు వైరల్ కావడం కొత్తేమీ కాదు. కానీ ఓ సారి బాలీవుడ్ నటి అవ్నీత్ కౌర్ పెట్టిన ఓ ఫొటోకు భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ పొరపాటుగా లైక్ కొట్టిన సంఘటన, సోషల్ మీడియాలో భారీ చర్చకు దారి తీసింది. ఈ ఒక్క లైక్‌తో అవ్నీత్ పాపులారిటీ భారీ పెరిగింది. కొద్ది గంటల వ్యవధిలోనే ఆమెకు 20 లక్షలకు పైగా ఫాలోయర్లు పెరగగా, 12 బ్రాండ్ ప్రొమోషన్ డీల్స్ కూడా వచ్చాయని వార్తలు వచ్చాయి. ఈ వ్యవహారం చర్చనీయాంశం అవుతున్న క్రమంలో, విరాట్ కోహ్లీ స్వయంగా స్పందిస్తూ, ఇది పూర్తిగా “అనుకోకుండా జరిగిన పొరపాటు” అని క్లారిటీ ఇచ్చారు. తన ఇన్స్టాగ్రామ్ ఫీడ్ క్లియర్ చేస్తూ ఉండగా లైక్ బటన్ అన్ఇంటెన్షనల్గా నొక్కినట్టు చెప్పారు. ఇందులో ఎలాంటి ఉద్దేశ్యం లేదని, ఊహాగానాలు అవసరం లేదని అభిప్రాయపడ్డారు.
ఇప్పుడు, ఈ అంశంపై అవ్నీత్ కౌర్ కూడా స్పందిస్తూ, పరోక్షంగా తనదైన శైలిలో చెప్పారు. “ప్రేమ దొరుకుతూనే ఉండాలి.. నేను ఇంతకంటే ఎక్కువ ఏమి చెప్పలేను.” అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం ఆమె తన తాజా చిత్రం ‘లవ్ ఇన్ వియత్నాం’ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. విరాట్ లైక్ ఘటనపై ఇలా చమత్కారంగా స్పందించడంతో, ఈ చర్చకూ ఓ ముగింపు వచ్చినట్టైంది. అయితే సోషల్ మీడియాలో ఈ సంఘటన ఇప్పటికీ హాట్ టాపిక్ గానే మారింది. ఒక ‘లైక్’ ఎంత ప్రభావం చూపించగలదో నెటిజన్లకు మరోసారి రుజువైంది.
ఇక విరాట్ కోహ్లీ విషయానికి వస్తే టెస్ట్, టీ 20లకి గుడ్ బై చెప్పిన విరాట్ ప్రస్తుతం వన్డేలకి మాత్రమే పరిమితమయ్యాడు. త్వరలో ఆస్ట్రేలియా జరగనున్న వన్డేలకి సన్నద్ధమవుతున్నాడు. ఇటీవల ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టాడు. 2027 వరల్డ్ కప్ వరకు ఆడి కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అంటున్నారు. ఇక కోహ్లీ ప్రస్తుతం తన ఫ్యామిలీలో లండన్‌లో ఉంటున్న విషయం తెలిసిందే.