Vadhuvu | చిన్నారి పెళ్లికూతురు (బాలిక వధూ) సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులను అలరించి ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో కథానాయికగా తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ బుల్లితెర నటి అవికాగోర్ (Avika Gor). ఈ సినిమాతో అవికా మంచి గుర్తింపును సంపాదించుకుంది. అయితే చాలా రోజుల గ్యాప్ తర్వాత మ్యాన్షన్ 24 (Mansion 24) అనే వెబ్ సిరీస్‌తో ముందుకు వచ్చింది అవికా. ప్రస్తుతం ఈ సిరీస్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. ఈ సిరీస్ వచ్చి నెల రోజులు కాకుండానే మరో వెబ్ సిరీస్‌ను లైన్లో పెట్టింది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న తాజా వెబ్ సిరీస్ ‘వధువు’(Vadhuvu). మ్యారేజ్ ఫుల్ ఆఫ్ సీక్రెట్స్ అనేది క్యాప్షన్. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్ విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
వెయ్యి అబద్ధాలాడైనా ఒక పెళ్ళి చేయాలి అంటారు. కానీ ఈ పెళ్లిలో అన్ని రహస్యాలే అంటూ ట్రైలర్ మొదలవుతుంది. ఇక ట్రైలర్ గమనిస్తే.. ఎవరో పెళ్లిని ఆపడానికి ప్రయత్నిస్తుండగా.. మరోవైపు.. పెద్ద పెద్ద కుటుంబాలలో పెళ్లి సమయంలో ఎలాంటి రహస్యాలు ఉంటాయి? అవి బయటపడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అనేదే ఈ సిరీస్ స్టోరీ అని అర్థమవుతోంది. ఇక ఈ రహస్యాలను అవికా కనుగొంటుందా.. మిస్టరీని ఛేదిస్తుందా అనేది తెలియాలంటే వధువు చూడాల్సిందే.
What happens when unanswered questions welcome the new bride?
Here’s the trailer of #VadhuvuOnHotstar. All questions will be answered from December 8.#VadhuvuonHotstar coming soon only on @DisneyPlusHS.@avika_n_joy @ActorAliReza @ActorNandu @iammony @shrikantmohta… pic.twitter.com/lMpDB5rcDu
— SVF (@SVFsocial) November 24, 2023
ఇక ఈ సిరీస్‌లో బిగ్‌బాస్ ఫేమ్ అలీ రెజా, నందు కూడా కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ+ హాట్‌స్టార్‌లో డిసెంబర్ 08 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ తెలిపారు.