ప్రపంచవ్యాప్త ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమా ‘అవతార్ : ఫైర్ అండ్ యాష్’. ఇప్పటికే విడుదలైన తొలి, మలి భాగాలు గ్లోబల్ విజయాలుగా నమోదయ్యాయి. దాంతో ఈ మూడో భాగం కోసం సగటు ప్రేక్షకుడు సైతం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాడు. డిసెంబర్ 19న సినిమా విడుదల కానుంది. ఈ తేదీలో ఏ భారతీయ చిత్రాల రిలీజ్లు లేకుండా ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ జాగ్రత్తలు పడుతున్నారు. నిజానికి బాలకృష్ణ ‘అఖండ 2’ను డిసెంబర్ మూడో వారంలోనే విడుదల చేయాలనుకున్నారు.
సరిగ్గా ఆ సమయంలోనే ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ ఉండటంతో.. ‘అఖండ 2’ మేకర్స్ రెండు వారాలు ముందుకు.. అంటే డిసెంబర్ 5కి జరిగారు. ప్రస్తుతం ‘అవతార్ 3’కి ఏ ఇండియన్ సినిమా పోటీ పడే పరిస్థితి లేదు. నవంబర్ చివర్లో గానీ, డిసెంబర్ తొలివారంలో గానీ ఇండియాలో ‘అవతార్’ ఈవెంట్‌ను కూడా నిర్వహించేందుకు జేమ్స్ కామరూన్ సన్నాహాలు చేస్తున్నారట. బహుశా ఆ వేడుకలోనే రాజమౌళి, మహేశ్‌ల ‘SSMB29’ అప్డేట్ కూడా రివీలయ్యే అవకాశం ఉంది.