Avatar-2 Break even Target | ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం ‘అవతార్-2’. 2009లో వచ్చిన ‘అవతార్’కు సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. లేజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టికి ప్రతి ప్రేక్షకుడు ఫిదా అయిపోయాడు. పండోరా అనే కొత్త గ్రహాన్ని సృష్టించి, ఆ లోకంలోకి మనల్ని కూడా తీసుకెళ్ళాడు. కలెక్షన్ల పరంగానే కాదు అవార్డుల పరంగా కూడా ఈ చిత్రం సంచలనం సృష్టించింది. దాదాపు 13ఏళ్ళ తర్వాత అవతార్-2 తెరకెక్కింది. ఈ చిత్రం 160 భాషల్లో డిసెంబర్ 16న విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్లు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ సినిమాకు భారీ స్థాయిలో బిజిఎస్ జరిగినట్లు తెలుస్తుంది. కొన్ని హాలీవుడ్ న్యూస్ ప్రకారం ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ కావాలంటే 2బిలియన్ డాలర్లు సాధించాల్సి ఉంటుందని టాక్. అంటే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 16వేల కోట్లకు పైగా కలెక్షన్లు సాధించాల్సి ఉంటుంది. ‘అవతార్’ సినిమా రీ-రిలీజ్‌తో కలుపుకొని బాక్సాఫీస్ దగ్గర దాదాపు 23వేల కోట్లకు పైగా గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. ప్రస్తుతం సీక్వెల్‌కు ఉన్న క్రేజ్‌తో అవతార్-2 16వేల కోట్లు సులవుగా సాధిస్తుందని పలువురు నెటీజన్లు అభిప్రాయపడుతున్నారు. అవతార్ సినిమాకు దాదాపు 2000 కోట్లకు పైగా బడ్జెట్ అయినట్లు టాక్. జేమ్స్ కామెరూన్ ‘అవతార్-2’ చిత్రాన్ని సముద్ర గర్భంలో ఆవిష్కరించాడు.
Read Also:
Rashmika Mandanna | ట్విస్ట్‌లతో సాగిపోతున్న రష్మిక బాలీవుడ్ ప్రయాణం..!
Hit-2 Movie | ఉత్కంఠ భరితంగా హిట్-2 ట్రైలర్.. అడివి శేష్‌కు మరో హిట్టు పడ్డట్టేనా ..!
Chandramukhi-2 | చంద్రముఖి సీక్వెల్లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్?
Kantara Movie | అరుదైన రికార్డు సాధించిన కాంతార..!