Chandramukhi-2 | చంద్రముఖి సీక్వెల్లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్?
Chandramukhi-2 Movie | హిట్టయిన సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుందంటే ప్రేక్షకులలో భారీ అంచనాలుంటాయి. అలాంటి అంచనాలోనే తెరకెక్కుతున్న చిత్రం 'చంద్రముఖి-2'. 2005లో వచ్చిన 'చంద్రముఖి' సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించింది.
Chandramukhi-2 Movie | హిట్టయిన సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుందంటే ప్రేక్షకులలో భారీ అంచనాలుంటాయి. అలాంటి అంచనాలోనే తెరకెక్కుతున్న చిత్రం ‘చంద్రముఖి-2’. 2005లో వచ్చిన ‘చంద్రముఖి’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించింది. దక్షిణాది ప్రేక్షకులకు సరికొత్త హర్రర్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చింది. అంతేకాకుండా హార్రర్ సినిమాలకు ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. కాగా దాదాపు 17ఏళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుంది. లారెన్స్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి పి. వాసు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరగుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ చిత్రంలోని కీలక పాత్ర కోసం బాలీవుడ్ నటి కంగానా రనౌత్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. అయితే చంద్రముఖి పాత్రలో నటించడానికి ఈమెను ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తున్నాడు. వడివేలు, రాధికా శరత్‌కుమార్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఎమ్.ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి తోట తరణి ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన పోస్టర్లు సినిమాపై విపరీతమైన క్యూరియాసిటీని పెంచాయి. నిజానికి చంద్రముఖి విజయం తర్వాత రజినీతోనే సీక్వెల్‌ను పట్టాలెక్కించాలని దర్శకుడు p.వాసు ఎంతో ప్రయత్నించాడు. కానీ అది కుదరలేదు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

