Kantara Movie Enters 400 Crore Club | ‘కాంతార’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఇంకా పరుగులు పెడుతూనే ఉంది. ఎలాంటి అంచనాల్లేకుండా సెప్టెంబర్ 30న మాతృక భాష కన్నడలో రిలీజైన ఈ చిత్రం అక్కడ సంచలన విజయం సాధించింది. ఈ క్రమంలో కాంతార చిత్రానికి అన్ని భాషల ప్రేక్షకుల నుండి భారీ డిమాండ్ ఏర్పడటంతో పలు భాషల్లోకి డబ్ చేసి ఆగస్టు 15న రిలీజ్ చేశారు. ఇక రిలీజైన ప్రతి భాషలో ఈ సినిమా భారీ వసూళ్ళను సాధించి డబుల్ బ్లాక్‌బస్టర్ నిలిచింది. సినిమా రిలీజై నెలరోజులు దాటినా ఇంకా కలెక్షన్లు స్టడీగానే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ చిత్రం మరో అరుదైన ఘనతను సాధించింది.
ఈ చిత్రం తాజాగా రూ.400 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టింది. కేవలం రూ.16 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా రూ.400 కోట్లు కలెక్ట్ చేసిందంటే ప్రేక్షకులు ఈ సినిమాను ఏ స్థాయిలో అధరించారో తెలుస్తుంది. తెలుగులో ఈ చిత్రాన్ని గీతాఆర్ట్స్ సంస్థ రిలీజ్ చేసింది. రూ.2 కోట్లు బ్రేక్ ఈవెన్‌తో రంగంలోకి దిగిన ఈ చిత్రం మొదటి రోజు బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని టాలీవుడ్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది. కన్నడలో ఈ సినిమా ఇప్పటివరకు రూ.168.50 కోట్లు కలెక్ట్ చేసింది. మరో మూడు కోట్లు సాధిస్తే కేజీఎఫ్-2(రూ.171.50) రికార్డు బ్రేక్ అవుతుంది. ఇక తమిళంలో రూ.12.70 కొట్లు, కేరళలో రూ.19.20 కోట్లు, ఓవర్సీస్ రూ.44.50 కోట్లు, నార్త్ ఇండియాలో రూ.96 కోట్లను సాధించింది.
రిషబ్‌శెట్టి నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. హోంబలే సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో రిషబ్‌కు జోడీగా సప్తమీగౌడ నటించింది. ఇక ఈ సినిమా నవంబర్ 24నుండి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.
‘KANTARA’ CROSSES ₹ 400 CR WORLDWIDE… #Kantara territory-wise breakup… Note: GROSS BOC…
⭐️ #Karnataka: ₹ 168.50 cr
⭐️ #Andhra / #Telangana: ₹ 60 cr
⭐️ #TamilNadu: ₹ 12.70 cr
⭐️ #Kerala: ₹ 19.20 cr
⭐️ #Overseas: ₹ 44.50 cr
⭐️ #NorthIndia: ₹ 96 cr
⭐️ Total: ₹ 400.90 cr pic.twitter.com/CmBQbLrZvf— taran adarsh (@taran_adarsh) November 22, 2022