Hit-2 Movie | ఉత్కంఠ భరితంగా హిట్-2 ట్రైలర్.. అడివి శేష్‌కు మరో హిట్టు పడ్డట్టేనా ..!
Hit-2 Trailer | ఎలాంటి అంచనాల్లేకుండా రిలీజై అనూహ్య విజయం సాధించిన చిత్రాల్లో ‘హిట్’ ఒకటి. విశ్వక్సేన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి సైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. దర్శకుడిగా సైలేష్కు డెబ్యూ సినిమానే అయినా.. తన టేకింగ్, విజన్‌తో ప్రేక్షకులను సినిమా లాస్ట్ వరకు సీట్లలోనే కూర్చోబెట్టాడు.
Hit-2 Trailer | ఎలాంటి అంచనాల్లేకుండా రిలీజై అనూహ్య విజయం సాధించిన చిత్రాల్లో ‘హిట్’ ఒకటి. విశ్వక్సేన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి సైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. దర్శకుడిగా సైలేష్కు డెబ్యూ సినిమానే అయినా.. తన టేకింగ్, విజన్‌తో ప్రేక్షకులను సినిమా లాస్ట్ వరకు సీట్లలోనే కూర్చోబెట్టాడు. ఈ చిత్రంతో ప్రొడ్యూసర్‌గా నానికి భారీ హిట్ వచ్చింది. కాగా రెండేళ్ళ తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కింది. సీక్వెల్లో అడివిశేష్ హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. తాజాగా చిత్రబృందం ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసింది.
ఫస్ట్ ఫ్రేమ్ నుండి లాస్ట్ ఫ్రేమ్ వరకు ట్రైలర్ ఉత్కంఠ భరితంగా సాగింది. పోలీసులకు చిక్కకుండా వరుస హత్యలు చేస్తున్న హంతకుడిని అడివిశేష్ ఎలా పట్టుకున్నాడు అనే నేపథ్యంలో చిత్రం తెరకెక్కింది. ట్రైలర్ మొత్తం ఆసక్తికరంగా సాగింది. ట్రైలర్ ప్రారంభంలో ఒక అమ్మాయినే హత్య చేశారు అని అందరూ అనుకుంటుండగా.. చివర్లో తల ఒకరిది, కాళ్ళు ఒకరివి, చేతులు ఒకరివి అంటూ రివీల్ చేయడం గూస్బంప్స్ తెప్పిస్తుంది. జాన్ స్టీవర్ట్ నేపథ్య సంగీతం థ్రిల్ ఫీల్‌ను కలిగిస్తుంది. మణికందన్ కెమెరా విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్‌తోనే సినిమాపై విపరీతమైన ఆసక్తి పెరిగింది.
సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం హిట్ యూనివర్స్‌లో భాగంగా రూపొందింది. అడివిశేష్‌కు జోడీగా మీనాక్షీ చౌదరీ నటిస్తుంది. కోమలి ప్రసాద్, రావు రమేష్ కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్‌పై హీరో నాని, ప్రశాంత్ తిపిరినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 2న పాన్ తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

