Avatar-2 Busniess | సాధారణంగా హాలీవుడ్ సినిమాలకు మన దగ్గర మార్కెట్ బాగానే ఉంటుంది. అయితే వచ్చిన ప్రతి సినిమా ఇక్కడ ఆడేస్తోందా అంటే సమాధానం నో అనే చెప్పాలి. కేవలం మార్వెల్ స్టూడియోస్, డీసీ నుంచి వస్తున్న సినిమాలకు మాత్రమే ఇండియాలో సూపర్ మార్కెట్ ఉంటుంది. ముఖ్యంగా సూపర్ హీరోస్ సినిమాలను మన వాళ్ళు ఎగబడి చూస్తుంటారు. అందుకే ఆ సినిమాలకు ఇక్కడ వందల కోట్ల కలెక్షన్స్ వస్తుంటాయి. అయితే ఎన్ని సినిమాలు వచ్చినా కూడా.. మన ఇండియన్ సినిమాలను డామినేట్ చేసే స్థాయి హాలీవుడ్‌కు లేదు అని చెప్పాలి. అయితే ఒక సినిమా మాత్రం ఇప్పుడు ఇండియన్ సినిమాలు డామినేట్ చేయడం కాదు.. ఏకంగా ఓవర్టేక్ చేయాలని చూస్తుంది. దాని పేరు ‘అవతార్-2’.
2009లో జేమ్స్ కెమెరాన్ తెరకెక్కించిన ‘అవతార్’ ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 21 వేల కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి.. ప్రపంచ సినిమాలోని ఆల్ టైం నెంబర్ వన్ గా నిలిచింది. ఈ 13 సంవత్సరాల్లో ఎన్నో బ్లాక్‌బస్టర్స్ వచ్చినా కూడా అవతార్ కలెక్షన్స్ ఇప్పటికి ఏ సినిమా దాటలేదు అంటే దాని రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అలాంటి సినిమా సీక్వెల్ అన్నప్పుడు అంచనాలు కూడా అలాగే ఉంటాయి. డిసెంబర్ 16న విడుదల కానున్న అవతార్ 2 బిజినెస్ కళ్ళు చెదిరే స్థాయిలో ఉంది. ముఖ్యంగా ఇండియాలో అయితే ఈ సినిమా బిజినెస్ 330 కోట్లకు పైగా జరుగుతుందని తెలుస్తుంది. అంటే మన దగ్గర స్టార్ హీరోలను మించి ఈ సినిమా బిజినెస్ చేస్తుంది.
ఇప్పటి వరకు హాలీవుడ్ సినిమాల్లో ఇండియాలో అత్యధిక కలెక్షన్ సాధించిన సినిమా అవెంజర్స్ ఎండ్ గేమ్. దీనికి 446 కోట్లకు పైగా వసూలు వచ్చాయి. దాని తర్వాత అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ 290 కోట్లకు పైగా వసూలు చేసింది. జంగిల్ బుక్ 258 కోట్లు వసూలు చేయగా.. జురాసిక్ వరల్డ్, స్పైడర్ మాన్ 3, టైటానిక్, 2012, జురాసిక్ పార్క్, లయన్ కింగ్ లాంటి సినిమాలు ఇండియాలో మంచి విజయం సాధించాయి. కానీ వీటి బిజినెస్ మాత్రం 100 కోట్ల లోపే జరిగింది. అయితే ఇప్పుడు అవతార్ 2 బిజినెస్ మాత్రం 330 కోట్లకు పైగా జరుగుతుండడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ముఖ్యంగా తెలుగు రైట్స్ కోసం 90 కోట్లకు పైగా డిమాండ్ చేస్తున్నారు మేకర్స్. అంటే ఇక్కడ మన స్టార్ హీరోలతో సమానంగా సినిమా బిజినెస్ జరుగుతుంది.
Read Also:
Manjima Mohan | ‘కడలి’ హీరోతో నాగచైతన్య హీరోయిన్ ప్రేమాయణం.. ఫోటోస్ వైరల్..!
SSMB28 | మహేష్-త్రివిక్రమ్ సినిమాలో విలన్‌గా ‘పొన్నియన్ సెల్వన్’ నటి?
Puri Jagannadh | పూరీ జగన్నాథ్ నెక్ట్స్ మూవీ ఆ సీనియర్ స్టార్ హీరోతోనేనా?
Kantara | బాక్సాఫీస్‌పై ‘కాంతార’ దండయాత్ర.. 16వ రోజు కూడా కోటిన్నరకు పైగా షేర్..!