Bigg Boss | నాగార్జున గారు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా.. బిగ్ బాస్‌కి పంపండి అంటూ రిక్వెస్ట్
Bigg Boss | బుల్లితెర ప్రేక్షకులకి మంచి వినోదం పంచుతున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. ఈ కార్యక్రమం సక్సెస్ ఫుల్‌గా ఎనిమిది సీజన్స్ పూర్తి చేసుకొని ఇప్పుడు తొమ్మిదో సీజన్‌కి సిద్ధంగా ఉంది. ఈ సీజన్‌కి కూడా అక్కినేని నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. అయితే ఇటీవల ఈ షోకి సంబంధించి ప్రోమో విడుదల కాగా, ఇందులో “ఇది చదరంగం కాదు… రణరంగం” అంటూ చెప్పడం బిగ్ బాస్ 9పై ఆసక్తిని మరింత పెంచింది.
Bigg Boss | బుల్లితెర ప్రేక్షకులకి మంచి వినోదం పంచుతున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. ఈ కార్యక్రమం సక్సెస్ ఫుల్‌గా ఎనిమిది సీజన్స్ పూర్తి చేసుకొని ఇప్పుడు తొమ్మిదో సీజన్‌కి సిద్ధంగా ఉంది. ఈ సీజన్‌కి కూడా అక్కినేని నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. అయితే ఇటీవల ఈ షోకి సంబంధించి ప్రోమో విడుదల కాగా, ఇందులో “ఇది చదరంగం కాదు… రణరంగం” అంటూ చెప్పడం బిగ్ బాస్ 9పై ఆసక్తిని మరింత పెంచింది. ఇక ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ కూడా వేగంగా కొనసాగుతోంది. బిగ్ బాస్ అంటే సెలబ్రిటీల షో అన్న టాక్ ఉంది. యాక్టర్స్, యాంకర్స్, యూట్యూబ్ స్టార్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లే ఈ షోలోకి ఎక్కువగా పాల్గొంటారు.
అయితే కొన్ని సీజన్లలో సామాన్యులకు అవకాశం ఇచ్చినా, అవి అంతగా వర్కవుట్ కాలేదు. కానీ ఈసారి మాత్రం కామన్ పీపుల్‌కి బంపరాఫర్ ఇచ్చింది బిగ్ బాస్ టీం.ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి ఇప్పటికే చాలా మంది సామాన్యులు అప్లై చేస్తున్నారు. మరికొందరు సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తూ, తమను బిగ్ బాస్ హౌస్‌లోకి పంపాలని కోరుతున్నారు.ఇటీవల ఓ మహిళ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘‘నాగార్జున గారు… నన్ను బిగ్ బాస్ హౌస్‌కి పంపండి. మీకు అద్భుతమైన టీ, కాఫీ వేస్తా. చక్కగా రోటి, పచ్చళ్ళు చేసి పెడతా. ఒక్క అవకాశం ఇస్తే జీవితాంతం రుణపడి ఉంటాను’’ అంటూ ఆమె చేసిన అభ్యర్థన ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అయింది.
‘‘వాళ్లకి వండి పెట్టేబదులు… మంచి హోటల్ పెట్టుకోమ్మా! గౌరవంతో పాటు డబ్బులు కూడా వస్తాయ్ అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈసారి బిగ్ బాస్ ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి అందరిలో ఉంది. కొత్త ఫార్మాట్, కొత్త గేమ్ ప్లాన్‌తో వస్తున్న ఈ సీజన్, గతంలో లాగే టీఆర్పీలను కొల్లగొడుతుందా? సామాన్యులకు అవాకాశం ఇస్తుండగా, ఈ ప్లాన్ ఎంత వరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

