August Second Week Theater/Ott Releasing Movies | ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు థియేటర్లలో సినిమాలు చూసేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదు. గత రెండు మూడు నెలలుగా థియేటర్లలో ఏ సినిమా కూడా రెండు వారాలకు మించి ఆడటం లేదు. గత వారం వరకు అసలు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల మాటే లేదు. దానికి ముఖ్యంగా టిక్కెట్ రేట్లు అధికంగా ఉండటం, రొటీన్ కమర్షియల్ సినిమాలే ఎక్కువగా రావడం, పైగా విడుదలైన సినిమాలన్ని నెల రోజుల్లోపే ఓటీటీలో దర్శనం ఇవ్వడం వంటివి ముఖ్య కారణమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే ఓటీటీలలో సినిమాను వీక్షించే వారి సంఖ్య ఎక్కువైంది. అయితే గతవారం విడుదలైన ‘బింబిసార’, ‘సీతారామం’ చిత్రాలు థియేటర్లకు ఊపిరిపోశాయి. చాలా కాలం తర్వాత ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్లకు వస్తున్నారు. కంటెంట్ ఉన్న సినిమాలు వస్తే ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారని ఈ రెండు చిత్రాలతో రుజువైంది. ఇదిలా ఉంటే ఈ వారం థియేటర్/ఓటీటీలలో ఏకంగా 30 సినిమాలు విడుదలవుతున్నాయి. అవెంటో ఓ లుక్కేద్దాం:
థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు:
ఈ వారం థియేటర్లలో మూడు సినిమాలు విడుదల కానున్నాయి.
లాల్ సింగ్ చడ్డా:
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్‌ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’. నాగ చైతన్య కీలకపాత్రలో నటించాడు. హాలీవుడ్లో సూపర్ హిట్టయిన ‘ది ఫారెస్ట్ గంప్’కు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కానుంది. ఇప్పటికే చిత్రం నుండి విడులైన పోస్టర్లు, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. ఈ చిత్రానికి తెలుగులో చిరంజీవి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు.
మాచర్ల నియోజకవర్గం:
యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఆగస్టు 12న విడుదల కానుంది. ప్రముఖ ఎడిటర్ రాజశేఖర్‌రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్గా నటించింది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు, సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పాయి.
కార్తికేయ-2:
ఎనిమల్ హిప్నటిజం అనే కాన్సెప్ట్‌తో 2014లో వచ్చిన ‘కార్తికేయ’ చిత్రానికి సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. నిఖిల్ హీరోగా నటించిన ఈ చిత్రానికి చందు ముండేటీ దర్శకత్వం వహించాడు. సీక్వెల్ అనౌన్స్మెంట్ చేసినప్పటి నుండే ప్రేక్షకులలో ఓ రేంజ్లో అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలను రెట్టింపు చేసింది. మిస్టర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 13న పాన్ ఇండియా సినిమాగా విడుదలవుతుంది.
ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు:
అమెజాన్ ప్రైమ్:
థాంక్యూ -ఆగస్టు 12(తెలుగు)
సోనిక్ ది ఏడ్జ్ హగ్-ఆగస్టు 10
ది లాస్ట్ సిటీ-ఆగస్టు 10
మలయాన్ కుంజు-ఆగస్టు 11
కాస్మిక్ లవ్-ఆగస్టు 12
ఏ లీగ్ ఆఫ్ దే యిర్ ఒన్-ఆగస్టు 12
నెట్‌ఫ్లిక్స్:
హ్యాపీ బర్త్‌డే-ఆగస్టు 8(తెలుగు)
నరుటో షిప్ప డేస్ -ఆగస్టు 8
ఐ జస్ట్ కిల్డ్ మై డ్యాడ్ -ఆగస్టు 9
ఇండియన్ మ్యాచ్ మేకింగ్-ఆగస్టు 9
లాకి అండ్ కి-ఆగస్టు 10
బ్యాంకు రాబర్స్: ది లాస్ట్ గ్రేట్ హెయిస్ట్ -ఆగస్టు 10
దోతా -ఆగస్టు 11
నెవర్ హౌ ఐ ఎవర్-ఆగస్టు 12
బ్రూక్లిన్ నైస్-ఆగస్టు 13
గాడ్జిల్లా VS కాంగ్-ఆగస్టు 14
ఆహా:
మాలిక్-ఆగస్టు 12
మహామనిషి-ఆగస్టు 12
ఏజెంట్ ఆనంద్ సంతోష్-ఆగస్టు 12
జీ-5:
రాష్ట్ర కవచం ఓం-ఆగస్టు 11
బ్యూటిఫుల్ బిల్లో-ఆగస్టు 11
విండో సీట్-ఆగస్టు 11
హలో వరల్డ్-ఆగస్టు 12
శ్రీమతి-ఆగస్టు 12
సోని లివ్:
గార్గి -ఆగస్టు 12 (తెలుగు)
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్:
ది వారియర్-ఆగస్టు 11 (తెలుగు, తమిళ్)
క్యాడవర్ -ఆగస్టు 12 (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం).