RRR Telugu Subtitles | సినిమా అర్థం కావట్లేదు..సబ్ టైటిల్స్ కావాలి రాజమౌళిగారు..!
ఆర్ఆర్ఆర్ (RRR) కథ ప్రకారం సినిమాలో బ్రిటిష్ వాళ్ళు ఉంటారు.. వాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటారు. దాదాపు 15 నిమిషాల సినిమాకు పైగా సినిమాలో ఇంగ్లీష్ డైలాగ్స్ (English Dialogues) ఉంటాయి.
ఓ వర్గం ప్రేక్షకుల నుంచి (RRR) చిత్ర దర్శక నిర్మాతలు ఇప్పుడు ఈ కంప్లైంట్ వస్తుంది. ఎందుకంటే కథ ప్రకారం సినిమాలో బ్రిటిష్ వాళ్ళు ఉంటారు.. వాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటారు. దాదాపు 15 నిమిషాల సినిమాకు పైగా సినిమాలో ఇంగ్లీష్ డైలాగ్స్ (English Dialogues) ఉంటాయి. ముఖ్యంగా మెయిన్ విలన్ స్కాట్ దొర మాట్లాడేవన్నీ ఇంగ్లీష్ లోనే ఉంటాయి. ఆ డైలాగ్స్ మాస్ ఆడియన్స్ కు అర్థం కావడం లేదని కంప్లైంట్స్ వస్తున్నాయి. కథ ప్రకారం అక్కడ జరిగేది ఏమిటో తమకు కూడా అర్థం కావాలి కదా అంటూ ఒక వర్గం ప్రేక్షకులు అందరూ రాజమౌళి (SS Rajamouli)కి అర్జీ పెట్టుకుంటున్నారు.
దీన్ని దర్శక నిర్మాతలు ఎంతవరకు పరిగనణలోకి తీసుకుంటారు అర్థం కావడం లేదు. అక్కడ ఇంగ్లీషులో మాట్లాడేటప్పుడు కచ్చితంగా కింద తెలుగులో కూడా సబ్ టైటిల్స్ (Telugu Subtitles) ఉంటే బాగుంటుంది అంటున్నారు ఆడియన్స్. అసలే బ్రిటిష్ ఇంగ్లీష్ అర్థం కావడం అంతంత మాత్రమే.. హాలీవుడ్ సినిమాలు చూసే వాళ్లకు తప్ప మిగిలిన వాళ్లకు ఇంగ్లీష్ అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు.
అలాంటిది చిన్న చిన్న ఊర్లలో చూసే మాస్ ప్రేక్షకులకు త్రిబుల్ ఆర్ సినిమాలో ఉన్న ఇంగ్లీష్ అర్థం కావడం అసాధ్యం అంటున్నారు విశ్లేషకులు. అందుకే వాళ్లు కోరుకుంటున్న సబ్ టైటిల్స్ కచ్చితంగా ఉండాల్సిందే అని ఇండస్ట్రీ వర్గాలు కూడా అంటున్నాయి. ఓవర్సీస్ లో ఎప్పుడూ సబ్ టైటిల్స్ తో సినిమా చూపిస్తారు.. కానీ ఇండియాలో మాత్రం అలా ఉండదు. ఇక్కడ ప్రాంతీయ భాషలో ఉంటాయి కాబట్టి ఎలాంటి సబ్ టైటిల్స్ లేకుండా సినిమా వస్తుంది.
Read Also : RRR Hindi collections | ఆర్ఆర్ఆర్ ఫస్ట్ వీకెండ్ హిందీ కలెక్షన్ల సంగతేంటి..!
సినిమాలో కొన్ని ఇంగ్లీష్ మాటలకు బ్యాక్ గ్రౌండ్లో తెలుగు వాయిస్ వస్తుంది. కానీ చాలా వరకూ ఇంగ్లీష్ డైలాగ్స్ అలాగే వదిలేశారు. వాటికి కూడా తెలుగు వర్షన్ ఇస్తే బాగుంటుంది అనేది ప్రేక్షకుల అభిప్రాయం. ఇప్పటికే సినిమా విడుదలై నాలుగు రోజులైంది. దాదాపు 500 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఇకపై కూడా ఖచ్చితంగా సినిమాకి అద్భుతమైన కలెక్షన్స్ వచ్చేలా కనిపిస్తోంది. అందుకే రాబోయే రోజుల్లో సబ్ టైటిల్స్ యాడ్ చేయాలని ప్రేక్షకులు డిమాండ్ చేస్తున్నారు.
Read Also : Nazriya Fahadh | లీలా థామస్, వివేక్‌ను చాలా మిస్సవుతున్నా..నాని భామ ఎమోషనల్ పోస్ట్
Read Also : Alia Bhatt | మౌనంగా ఆర్ఆర్ఆర్ బ్యూటీ అలియాభట్..ఇంతకీ కారణమేంటో ?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

