ఆర్ఆర్ఆర్ (RRR) విడుదలైన అన్నికేంద్రాల్లో సక్సెస్ ఫుల్ టాక్‌తో, మంచివసూళ్లతో స్క్రీనింగ్ అవుతుంది. ఇండియాతోపాటు ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లోనే రూ.500 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయి బాక్సాపీస్‌ను షేక్ చేస్తోంది. లీడ్ యాక్టర్లు రాంచరణ్, ఎన్టీఆర్ ఏదో ఒక ఈవెంట్స్, ఇంటర్వ్యూలతో బిజీబిజీగా ఉన్నారు. కానీ ఫీ మేల్ లీడ్ రోల్ చేసిన అలియాభట్ (Alia Bhatt) నుంచి సినిమాపై ఎలాంటి స్పందన రావడం లేదేంటి..? అని ఇపుడు మూవీ లవర్స్ తెగ చర్చించుకుంటున్నారు.
అలియాభట్ ఎందుకు మౌనంగా ఉందంటూ మాట్లాడుకుంటున్నారు. ఈ భామ ప్రస్తుతం ఇండియాలో ఉన్న పెద్ద స్టార్లలో ఒకరు. గంగూభాయ్ కథియావాడి (Gangubai Khatiawadi) సినిమాతో ఇటీవలే భారీ హిట్టును ఖాతాలో వేసుకుంది. అయితే అలియాభట్ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కనిపించలేదు. కానీ ఢిల్లీలో జరిగిన ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్నది.
మరి తాను వన్ ఆఫ్ ది కీ రోల్ లో నటించిన ఆర్ఆర్ఆర్కు భారీ స్థాయిలో పాజిటివ్ టాక్ వస్తుంటే..అలియా భట్ ప్రశంసించడం కానీ, థ్యాంక్యూ అనే ట్వీట్ కానీ చేయకపోవడం ఏంటని ఇపుడు చాలా మంది నెటిజన్లు తలలు పట్టుకుంటున్నారు. ఈ భామ ప్రస్తుతం అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న బ్రహ్మాస్త్ర (Brahmastra)లో కీలక పాత్రలో నటిస్తోంది. రణ్ బీర్ కపూర్, నాగార్జున, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.