‘మంచి చిత్రాలను ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారని ‘కంగువ’ విజయం మరోసారి రుజువైంది. తమిళ్ కంటే తెలుగులోనే ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. సూర్య కెరీర్లో టిల్ డేట్ హయ్యెస్ట్ కలెక్టెడ్ మూవీగా ‘కంగువ’ నిలుస్తుంది. నార్త్ బెల్ట్‌లో కూడా ‘కంగువ’కు మంచి వసూళ్లు రావడం ఆనందంగా ఉంది. మూడేళ్ల కష్టానికి ఫలితం ఈ విజయం’ అని కేఈ జ్ఞానవేల్‌రాజా అన్నారు. సూర్య హీరోగా శివ దర్శకత్వంలో ఆయన నిర్మించిన చిత్రం ‘కంగువ’. గురువారం విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తున్నదని జ్ఞానవేల్‌రాజా ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన విలేకరులతో ముచ్చటించారు. ‘హ్యూజ్ ప్రొడక్షన్ వాల్యూస్, సీజీ వర్క్, సూర్య అనితరసాధ్య అభినయం ఈ సినిమాను మరో స్థాయిలో నిలబెట్టాయి.
ప్రేక్షకులకు థియేటర్లలో ఓ కొత్త ప్రపంచాన్ని చూసిన అనుభూతికి లోనవుతున్నారు. పాత్రల్లోని జెన్యూనిటీ తగ్గకుండా, అద్భుతమైన కమర్షియల్ ఎలిమెంట్స్‌తో దర్శకుడు శివ ఈ సినిమాను రూపొందించారు. ైక్లెమాక్స్‌లో వచ్చే గెస్ట్రోల్ని సర్ప్రైజ్ కోసం ముందు రివీల్ చేయలేదు. అలా హైడ్ చేయడంవల్లే ఈ రోజు థియేటర్లో ఆ పాత్రను చూసి ఆడియన్స్ థ్రిల్ అవుతున్నారు.’ అని తెలిపారు.
ఇంకా చెబుతూ ‘సూర్య రెండు పాత్రలుకూ మంచి అప్రిషియేషన్ వస్తున్నది. ఈ సినిమాకోసం ఆయన పడిన కష్టం తెరపై కనిపించింది. బాబీడియోల్ పర్ఫార్మెన్స్ మరో హైలైట్‌గా నిలిచింది. అలాగే దేవిశ్రీ పాటలతోపాటు నేపథ్య సంగీతానికి కూడా మంచి స్పందన కనిపిస్తున్నది. ‘కంగువ 2’ గురించి అభిమానులు అడుగుతున్నారు. అజిత్‌తో దర్శకుడు శివ ఓ సినిమా చేయాల్సివుంది. అది అయ్యాక ‘కంగువ 2’ మొదలవుతుంది’ అని తెలిపారు జ్ఞానవేల్‌రాజా.