HomeCinemaAtlee To Work With Allu Arjun For His Next
Allu Arjun | అల్లు కోసం అట్లీ ప్రయత్నాలు?
Allu Arjun | అట్లీ ‘జవాన్' సినిమా రేపు 7న విడుదల అవుతున్న విషయం తెలిసిందే. షారుఖ్‌ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమాలో నయనతార, విజయ్‌సేతుపతి తదితర సౌత్ స్టార్లు కూడా నటించడంతో ‘జవాన్'పై క్రేజ్ ఆకాశమంత ఎత్తులో ఉంది.
అట్లీ ‘జవాన్’ సినిమా రేపు 7న విడుదల అవుతున్న విషయం తెలిసిందే. షారుఖ్‌ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమాలో నయనతార, విజయ్‌సేతుపతి తదితర సౌత్ స్టార్లు కూడా నటించడంతో ‘జవాన్’పై క్రేజ్ ఆకాశమంత ఎత్తులో ఉంది. ఇదిలావుంటే.. దర్శకుడు అట్లీ తర్వాతి ప్రాజెక్ట్ విషయంలో ఆసక్తికరమైన వార్త ఒకటి వినిపిసున్నది.
అల్లు అర్జున్ కోసం ఆయన ఓ కథ తయారు చేసుకున్నారట. త్వరలో బన్నీకి ఆ కథ వినిపించాలని ప్రయత్నాలు ముమ్మరం చేశారట అట్లీ. నిజానికి ‘జవాన్’లోనే బన్నీ నటిస్తున్నట్లు అప్పట్లో వార్తలొచ్చాయ్. కానీ అందులో నిజం లేదని తేలింది. ఇప్పుడు అట్లీ చేయబోయే తర్వాతి పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కి బన్నీనే కథానాయకుడు కావచ్చనేది సినీవర్గాల భోగట్ట. ప్రస్తుతానికి బన్నీ ‘పుష్పా2’తో, అట్లీ ‘జవాన్’ ప్రమోషన్లో బిజీగా ఉన్నారు. వీరిద్దరి కాంబినేషన్ నిజంగా సినిమా ఖరారైతే బన్నీ అభిమానులకు పండగే.