Atlee | చేసింది తక్కువ సినిమాలే అయినా స్టార్ డైరెక్టర్ల లిస్ట్‌లోకి చేరిపోయాడు అట్లీ. మరీ ముఖ్యంగా జవాన్‌తో పాన్ ఇండియా రేంజ్లో క్రేజ్ తెచ్చుకున్నాడు. అట్లీని నమ్మి షారుఖ్ స్వయంగా నిర్మాతగా తానే బాధ్యతలు తీసుకుని జవాన్ కోసం వందల కోట్లను మంచి నీళ్లలా ఖర్చుపెట్టాడు. అట్లీ సైతం షారుఖ్ నమ్మకాన్ని నిలబెట్టాడు. ఏకంగా వెయ్యి కోట్ల బొమ్మను ఇచ్చాడు. ప్రస్తుతం జవాన్ టీమ్ అంతా ఫుల్ ఖుషీగా ఉంది. మరీ ముఖ్యంగా అట్లీ ఆనందం అంతా ఇంతా కాదు. సినిమా రిలీజై దాదాపు నెల దగ్గరికొస్తున్నా ప్రమోషన్లు గట్రా చేస్తూ సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్తున్నాడు. అయితే ఈ సినిమా మరీ ఎవర్గ్రీన్ హిట్టని చెప్పలేం. పోటీగా సినిమాలు లేకపోవడం, పఠాన్ సక్సెస్ కలిసి రావడం, ఒక ప్రాపర్ కమర్షియల్ ప్యాకేజీని కింగ్ ఖాన్ మోసిన విధానం.. ఇలా పలు విషయాలు ఈ సినిమా సక్సెస్‌లో కీలకపాత్రలు పోషించాయి.
కాగా ఈ సక్సెస్ పట్ల సంతోషంగా ఉండటం ఒకే కానీ.. ఈ సినిమా సక్సెస్‌లో భాగంగా అట్లీ మాటలు ట్రోల్స్‌కు దారితీస్తున్నాయి. ఆ మధ్య జవాన్ సినిమాను ఆస్కార్ నామినేషన్‌కు పంపించే ఆలోచనలో ఉన్నామని చెప్పి తొలిసారి ఈ ట్రోలర్ రాయుళ్లకు టార్గెట్ అయ్యాడు. ఎంటర్టైనింగ్ వేలో జనాలను ఎంత ఆకట్టుకున్నా.. జవాన్‌కు ఆస్కార్ వెళ్లే రేంజ్ లేదన్నది ఓపెన్ టాక్. పైగా ఇదొక ప్రాపర్ కమర్షియల్ సినిమా. అయినా ఈ సినిమా గురించి అట్లీ అలా చెప్పడంతో తీవ్ర ట్రోల్స్‌కు గురైయ్యాడు. అంతటితో ఆగకుండా జవాన్ సినిమా వల్ల హాలీవుడ్ ప్రొడక్షన్ హౌసెస్ నుంచి పిలుపులు వచ్చాయని, నా నెక్స్ట్ సినిమా స్పానిష్‌లో తెరకెక్కిస్తానని చెప్పుకొచ్చాడు.
ఇంకేముంది దాంతో అట్లీని ట్రోలర్ రాయుళ్లు ఓ రేంజ్లో ఆడుకున్నారు. తాజాగా ఇలాంటి వ్యాఖ్యలే మరోటి చేసి హాట్ టాపిక్ అయ్యాడు. షారుఖ్, విజయ్‌లను పెట్టి ఓ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నట్లు ఆ మధ్య చెప్పాడు. కాగా తాజాగా వాళ్ళిద్దరితో చేసే సినిమా రూ.3000 కోట్లు ఈజీగా దాటేస్తుందని చెప్పాడు. దాంతో అట్లీపై నెటీజన్లు విరుచుకుపడుతున్నారు. తీసిన ఒక్క వెయ్యి కోట్ల సినిమాకే ఈ రేంజ్లో పొంగిపోవాలా.. బాహుబలి-2, ఆర్ఆర్ఆర్ వంటి ఇండస్ట్రీహిట్లు తీసిన రాజమౌళి ఎలా ఉంటాడు. తన సినిమాల స్థాయి ఇదని నెత్తిన పెట్టుకుని ఊరేగడు. ఎంత పెద్ద సక్సెస్ వచ్చినా పొంగిపోకూడదూ అనే సూత్రాన్ని రాజమౌళిని చూసి నేర్చుకోవాలని నెటీజన్లు ఆడేసుకుంటున్నారు.