త్రివిక్రమ్-మహేశ్ బాబు (Mahesh Babu) కాంబినేషన్ అనగానే ఠక్కున గుర్తొచ్చే సినిమా అతడు (Athadu). కామ్‌గా కూల్‌గా స్టైలిష్ యాక్టింగ్‌తో అదరగొట్టేశాడు మహేశ్. కోలీవుడ్ భామ త్రిష (Trisha) హీరోయిన్గా నటించింది. సిల్వర్ స్క్రీన్‌పై రిపీటెడ్‌గా ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టని సినిమాల్లో టాప్‌లో ఉంటుంది అతడు. అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టింది అతడు.
చాలా కాలం తర్వాత ఈ ఆల్‌టైమ్ ఎవర్గ్రీన్ సినిమా లొకేషన్ లో తీసిన త్రోబ్యాక్ స్టిల్ ఒకటి నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. త్రివిక్రమ్ (Trivikram) కీలక సన్నివేశం ఒకటి హీరోహీరోయిన్లకు వివరిస్తున్నాడు. టెలివిజన్ చరిత్రలో ఎక్కువగా టెలికాస్ట్ అయిన తెలుగు సినిమాగా అతడు నిలిచింది. ఇక త్రివిక్రమ్-మహేశ్ కాంబోలో రెండో ప్రాజెక్టు ఖలేజా కూడా వచ్చింది.
ఇక ప్రస్తుతం ఎస్ఎస్ఎంబీ 28 సినిమాతో హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అవుతున్నారు మహేశ్-త్రివిక్రమ్. ఈ నెలలో షూటింగ్ మొదలు కానుంది. ఈ ఇద్దరు మరోసారి సిల్వర్ స్క్రీన్‌పై మ్యాజిక్ చేయడం ఖాయమని ధీమాగా ఉన్నారు సినీ జనాలు.