Athadu Movie Re release | సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం అతడు రీ రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. మహేశ్ బాబు బర్త్‌డే సందర్భంగా ఆగష్టు 09న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా మూవీ అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ చేశారు మేకర్స్. అయితే ఈ బుకింగ్స్‌లో అరుదైన రికార్డు సొంతం చేసుకుంది చిత్రం. రీ రిలీజ్ ఇంకా వారం ఉండగానే అడ్వాన్స్ బుకింగ్స్‌లో రూ.కోటి మార్క్‌ని అందుకుంది. దీంతో రీ రిలీజ్లో ఈ మార్క్ అందుకున్న తొలి చిత్రంగా అతడు నిలిచింది. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మురళీ మోహన్ నిర్మాతగా వ్యవహరించాడు.
ఓవర్సీస్, తెలుగు రాష్ట్రాల్లోనూ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. నైజాంలో ఏషియన్ సునీల్ రిలీజ్ చేస్తుండగా.. సుదర్శన్ 35, దేవిలో అడ్వాన్స్ బుకింగ్స్ హౌస్ ఫుల్ అయ్యాయి. ఏరియాల వారీగా పోటీ పడి మరి భారీ ధరకు అతడు రీ రిలీజ్ హక్కులు కొనుగులు చేస్తున్నట్లు సమాచారం. రీ రిలీజ్ థియేట్రికల్ రైట్స్ హక్కులు రికార్డు స్థాయిలో రూ.3కోట్లకుపైగా ధర పలికినట్లు తెలుస్తున్నది.
పేను తూఫాను తలంచి చూసే…🔥🔥#Athadu4K grossed ₹1 Cr+ All India advance sales inc Day1 & Day2 💥💥
Superstar @urstrulymahesh is rewriting his re-release history!😎😎#Athadu #Athadu4KBookings pic.twitter.com/n2YCYE1JYX
— Athadu4K (@Athadu4K) August 3, 2025