అథర్వా, మిష్టి, అనైకాసోటి జంటగా నటిస్తున్న చిత్రం ‘డస్టర్ 1212’. బద్రీ వెంకటేష్ దర్శకుడు. మరిపి విద్యాసాగర్, విసినిగిరి శ్రీనివాస్ రావు నిర్మాతలు. గురువారం చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. మార్చి 4న ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ జీవితంలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాం. సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఆద్యంతం ఉత్కంఠను పంచుతుంది. కుటుంబ ప్రేక్షకుల్ని కూడా మెప్పిస్తుంది’ అన్నారు. వినూత్నమైన కథాంశమిదని, తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుందని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: గోపీ అమర్నాథ్, సంగీతం: యువన్‌శంకర్ రాజా, మాటలు: రాజశేఖర్ రెడ్డి, నిర్మాణ సంస్థ: వి.యస్.ఆర్.మూవీస్, శుభకరి క్రియేషన్స్, దర్శకత్వం: బద్రి వెంకటేష్.